AP Employees PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ ను దాదాపు ఖాయం చేశారు. అయితే 11 ప్రతిపాదనలు పెట్టారు. దీంతో సీఎం జగన్ దేన్నీ ఒకే చేస్తారన్నది ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. పీఆర్సీ, ఫిట్ మెంట్ పై తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు అధికారులు అందించారు. నివేదికను సీఎం జగన్ పరిశీలించిన అనంతరం సచివాలయంలో సీఎస్ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ, ఫిట్ మెంట్ పై వివరాలు వెల్లడించారు. ఫిట్ మెంట్ పై సీఎం జగన్ కు 11 ప్రతిపాదనలు ఇచ్చారు. పీఆర్సీ నివేదికను వెబ్ సైట్ లో ఉంచనున్నారు.
ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్ మెంట్ ను అధికారులు పరిశీలించారు.. పీఆర్సీ, ఫిట్ మెంట్ అంశాలపై సుధీర్ఘంగా చర్చించిన తర్వాత 7 రకాల సిఫార్సులు చేశారు… నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని గుర్తించారు… 5 అంశాలను మార్పులతో అమలు చేయాలి.. 2 అంశాలను అమలు చేయక్కర్లేదు. ఇలా ప్రతిపాదనలు సూచించారు.
Also Read: జగన్ కు ప్రాణభయం పొంచి ఉందట?
11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిట్ మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిట్ మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 14శాతం ఫిట్ మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో 30శాతం ఫిట్ మెంట్.. ఇలా 7 రకాల ప్రతిపాదనలు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకూ అదనపు భారం పడనుంది.
ఇక ఒప్పంద, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్ మెంట్ సిఫార్సు చేశారు. అధికారులు, నిపుణులతో చర్చించాక ఫిట్ మెంట్ ఎంత ఇవ్వాలన్నది సీఎం జగన్ 3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఆర్థికశాఖ తో చర్చించి దీన్ని అమలు చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ పరిణామంతో ఊరట కలిగింది.
Also Read: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?