https://oktelugu.com/

Bollywood: ఎల్లప్పుడూ ఇలానే ఉండనివ్వండి అంటున్న కత్రినా కైఫ్…

Bollywood: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కత్రినా కైఫ్.  బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపింది ఈ భామ. కాగా ఈ ప్రేమ జంట  డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సవాయ్ మాధోపూర్‌ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ ఫొటోస్,  పసుపు ఫంక్షన్ ఫొటోస్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 08:47 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కత్రినా కైఫ్.  బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపింది ఈ భామ. కాగా ఈ ప్రేమ జంట  డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సవాయ్ మాధోపూర్‌ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ ఫొటోస్,  పసుపు ఫంక్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కత్రినా కైఫ్‌ తన పెళ్లిలో ధరించిన లెహంగాను డిజైనర్ సబ్యసాచి వజ్రాలు, ముత్యాలతో ఎంతలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారో వివరిస్తూ ఆమె వివాహం వేడుకలో తన ఆరుగురు సోదరీమణులతో మహారాణీలా ఎంతో అందంగా రాజసం ఉట్టిపడేలా నడుస్తున్న ఫోటోలను సోషల్‌ మీడీయాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    తన ఆరుగురు సోదరీమణులను ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో అభిమానంతో పంచుకుంటూ కాస్త ఎమోషనల్ గా … తన బలం తన సోదరీలే నని చెప్పింది కత్రీనా.  మా బంధం ఎప్పటికీ ఇలానే ధృఢంగా ఉండాలంటూ… మా సోదరీమణులు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటాము అని చెప్పుకొచ్చింది. మేము ఎప్పుడూ ఒకరికొకరు అండంగా ఉంటాం… ఇది ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది కత్రినా. ఇదిలా ఉంటే వీరి వివాహం తర్వాత రిసెప్షన్ వేడుకను ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఈ నవ దంపతులు. చూడాలి మరి ఈ వేడుకలో బాలీవుడ్ తారలు ఎవరు మెరవనున్నారో.