Homeఎంటర్టైన్మెంట్Nagarjuna 100th Movie: 'కింగ్ 100' లో కీలక పాత్ర పోషిస్తున్న సూపర్ స్టార్.. అక్కినేని...

Nagarjuna 100th Movie: ‘కింగ్ 100’ లో కీలక పాత్ర పోషిస్తున్న సూపర్ స్టార్.. అక్కినేని ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్..

Nagarjuna 100th Movie: అక్కినేని ఫ్యామిలీ అభిమానులు నాగార్జున కం బ్యాక్ కోసం ఇంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగార్జున సమకాలిక హీరోగాలైనటువంటి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ వంటి వారు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ , ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే స్థాయిలో ఉంటే , నాగార్జున వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటూ , క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం పై అక్కినేని ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ‘కూలీ’ చిత్రంలో ఆయన పోషించిన విలన్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ వ్యక్తం చేసిన అసంతృప్తి ఏ రేంజ్ లో ఉన్నిందో మనమంతా చూశాము . సీనియర్ హీరోల్లో అందరికంటే బెస్ట్ లుక్స్ ఉన్నది ప్రస్తుతానికి నాగార్జునకు మాత్రమే , కచ్చితంగా ఆయనకు సోలో గా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి, అందుకు ఆయన అర్హుడు అనేది అక్కినేని ఫ్యాన్స్ వాదన.

అందుకే నాగార్జున 100 వ చిత్రం పై అక్కినేని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ‘కింగ్ 100’ గా పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అభిమానులు , ప్రేక్షకులు నాగార్జున నుండి ఏమి కోరుకుంటున్నారో , అంతకు మించే ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం లో టబు కీలక పాత్ర పోషిస్తోంది. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రమిది. ఇకపోతే ఈ చిత్రం లోకి మరో ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఆ ప్రముఖ నటుడు మరెవరో కాదు , కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. కథకి అత్యంత కీలకమయ్యే పాత్రలో ఆయన ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అట.

ఉపేంద్ర నాగార్జున విలన్ గా నటించిన ‘కూలీ’ చిత్రం లో కూడా కీలక పాత్ర పోషించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి కుడిభుజం లాగా , అత్యంత శక్తివంతమైన పాజిటివ్ క్యారెక్టర్ లో ఉపేంద్ర ఆ చిత్రం లో కనిపిస్తాడు. అదే ఉపేంద్ర ఇప్పుడు నాగార్జున చిత్రం లో కీలక పాత్ర పోషించబోతుండడం గమనార్హం. ఉపేంద్ర పాత్ర కచ్చితంగా సినిమాకు అదనపు బలంగా మారుతుందని , పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని అంటున్నారు. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ , అదే విధంగా గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం జనాలపై చూపిస్తుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version