Anil Ravipudi And Kalyan Ram: అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరిస్తుంది అంటూ మేకర్స్ అయితే క్లారిటి ఇస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారు. తద్వారా ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోబోతుంది అనేది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఇప్పటివరకు 9 విజయాలను సాధించాడు. ఈ సినిమాతో పదో విజయాన్ని సాధించి వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకులలో రాజమౌళి తర్వాత తను మాత్రమే ఉన్నానని చాలా గర్వంగా చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తను అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో తనను తాను చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేసుకోబోతున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి అప్పు ఇచ్చే క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట. వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ఉంటాయని ఇద్దరు బావ బామ్మర్దుల క్యారెక్టర్ లో నటించెబుతున్నారని దానికి తగ్గట్టుగానే ప్రతి సన్నివేశాన్ని కూడా కామెడీతో నింపేసే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నాడట.
యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయని ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని కూడా అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేసి సక్సెస్ ని సాధిస్తాడా? ఆయనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకుంటాడా?
ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ వాళ్లిద్దరి ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మలిచాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో తన సత్తా చాటుకుంటే మాత్రం ఆయన టాప్ డైరెక్టర్ గా మారడమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎక్కువ మంది తో సినిమాలు చేసిన దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకుంటాడు…
