ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోని పొగిడితే వినడానికి బాగా వినసొంపుగా ఉంటుంది. అందులో ఒక భాషలో సూపర్ స్టార్, మరో భాషలోని స్టార్ హీరోని పొగిడితే రెండు భాషల అభిమానులు కూడా చాల గొప్పగా చెప్పుకుంటారు. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అంటే.. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్, తమిళ స్టార్ హీరో సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ భారీ స్టేట్ మెంట్ లు పాస్ చేసిన దాని గురించి.
సుదీప్ ఇటీవల ఓ ఛానల్ కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే, ఆ ఇంటర్వ్యూలో ‘సూరరై పోట్రు’ సినిమాలో హీరోగా నటించిన సూర్య గురించి సుదీప్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సుదీప్ మాటల్లోనే ‘నేను ఇటీవల సూరరై పోట్రు సినిమా చూశాను. అసలు నేను ఊహించలేదు. ఆ సినిమాలో సూర్య అంత గొప్పగా నటిస్తాడు అని.
కచ్చితంగా చెప్పగలను. ఆ సినిమాలో సూర్య నటించిన విధానానికి, సూర్య గొప్ప నటనకు తప్పకుండా సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇదేదో మాటవరసకు చెప్పడం లేదు. ఆస్కార్ అవార్డుకు సూర్య నిజమైన అర్హుడు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య అద్భుతమైన నటుడు.
సుదీప్, సూర్య గురించి ఇంకా మాట్లాడుతూ.. సూర్య చాలా నిజాయితీ గల వ్యక్తి. అతనితో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. అసలు వదులుకోను. అంటూ సెలవిచ్చాడు సుదీప్. ఇక సూర్య నటించి నిర్మించిన ‘సూరరై పోట్రు’ సినిమా ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సుదీప్ కూడా రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడు.