
భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవికి ప్రధాని నరేంద్రమోదీ అండగా నిలిచారు. ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శన అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శక్తిమేరకు పోరాడావంటూ అభిందించారు. భవానీదేవి అరంగ్రేటం ఒలింపిక్స్ లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచింది. అయితే, రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమి పాలైంది. అలాగే రెండో రౌండ్లో ఓడిపోయనందుకు క్షమాపణలు తెలియజేసింది. ఆమె ట్వీటుకు మోదీ స్పందించారు. మీ అత్యత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. అని ప్రధాని మోదీ అన్నారు.