‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఓ పాన్ ఇండియా సినిమాని చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది. లేదు, ఫలానా హీరోయిన్ ను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ, ఇలా అనేక రకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను నిజంగానే మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తి అయిందట, మరి ఆ హీరోయిన్ ఎవరు అంటే.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ‘కియారా అద్వానీ’. త్వరలోనే ఈ వార్త పై అధికారిక ప్రకటన రానుంది. బహుశా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి, ఆ రోజున ఈ సినిమాకి సంబంధించి మిగిలిన అన్ని అంశాల పై క్లారిటీ ఇస్తూ ఎనౌన్స్ చేస్తారట.
కాగా ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడని, కొరటాలతో పాటు రచయిత కోన వెంకట్ కూడా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ పై ఒక రూమర్ వచ్చింది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశారని, అందులో భాగంగా పలనాటి ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయట. ఎన్టీఆర్ సినిమాలో మొత్తంగా మూడు గెటప్స్ లో కనిపిస్తాడని కూడా అన్నారు. ఇక ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఆ రోజున మరో ఏ పెద్ద సినిమా తమ సినిమాకి పోటీగా రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విడుదల తేదీని చాల ముందే అధికారికంగా ప్రకటించారు ఎన్టీఆర్ టీమ్.