https://oktelugu.com/

ఫిల్మ్ సిటీలో కీర్తి సురేష్ తో రజినీకాంత్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ కి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో.. ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆయన బయటకు రాకూడదని వైద్యుల సలహా ఇచ్చారని.. అందుకే ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారని.. ఇక ఇప్పట్లో ఆయన సినిమా చెయ్యడు అని రూమర్స్ బాగా వినిపించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కూడా ఇప్పట్లో ఉండదు అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. డైరెక్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 07:11 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజినీకాంత్ కి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో.. ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆయన బయటకు రాకూడదని వైద్యుల సలహా ఇచ్చారని.. అందుకే ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారని.. ఇక ఇప్పట్లో ఆయన సినిమా చెయ్యడు అని రూమర్స్ బాగా వినిపించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కూడా ఇప్పట్లో ఉండదు అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. డైరెక్టర్ శివ కూడా ఇప్పటికే రజిని లేని సీన్స్ ను షూట్ కి రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే సడెన్ గా రజిని షూట్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి, రజినీకాంత్ ఈ సినిమా పూర్తి చేస్తాడా? లేదా అనే అనుమానం ఉన్న తరుణంలో.. ఏకంగా ఇలా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.

    Also Read: ప్రభాస్ కి అమ్మగా ఒకప్పటి హాట్ బ్యూటీ !

    వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని రజిని టార్గెట్ పెట్టుకుని డేట్స్ ఇచ్చాడట. ఈ నెల రోజుల గ్యాప్ లోనే మొత్తం కంప్లీట్ చెయ్యాలని రజిని ఫిక్స్ అయ్యాడట. రామోజీ ఫిలిం సిటీలో లాంగ్ షెడ్యుల్ జరుగుతుందని.. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని.. ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా ఈ సినిమా షూట్ కోసం హైదరాబాద్ కి వచ్చేసిందని తెలుస్తోంది. రజిని, కీర్తి పై కీలక సీన్స్ తీయనున్నారని సమాచారం. ఈ సినిమాలో మీనా, ఖుష్బూ కూడా నటిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.

    Also Read: అదనంగా డబ్బులు ఇస్తేనే ముద్దులు పెడతాను !

    ఎందుకంటే మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది గొప్ప టాలెంట్. ఆయన గత సినిమాలు ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు చూస్తేనే శివ డైరెక్షన్ రేంజ్ అర్ధమవుతోంది. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రజినీకాంత్… తమిళనాడు అంతా పర్యటిస్తాడట. ఆయన పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందిలేండి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్