Genelia shocking statement: చాలా కాలం తర్వాత మన తెలుగు ఆడియన్స్ కి ‘జూనియర్'(Junior Movie) అనే చిత్రం ద్వారా హాయ్ చెప్పింది హీరోయిన్ జెనీలియా(Genelia Deshmukh). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో చేసిన ‘ఆరెంజ్’ తర్వాత మళ్ళీ ఆమె మన తెలుగు సినిమాలో నటించలేదు. కేవలం తన సంసార జీవితం పైనే ఫోకస్ పెట్టింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది కూడా. అలా పిల్లలు కాస్త ఎదిగి స్కూల్ కి వెళ్లే వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బలమైన క్యారెక్టర్స్ చేస్తూ తన బ్రాండ్ ఇమేజ్ ని మరోసారి పదిలం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది జెనీలియా. ఈ క్రమం లోనే ఆమె ‘జూనియర్’ చిత్రం చేసింది. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి(Gaali Janardhan Reddy) కుమారుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది.
Also Read: టాలీవుడ్ యంగ్ హీరో తో డేటింగ్ లో సానియా మీర్జా..ఎవరా యంగ్ హీరో?
శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని ‘వైరల్ వయ్యారి’ పాటలో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే విడుదలకు ముందు జెనీలియా ఈ సినిమా ప్రొమోషన్స్ లో
చాలా చురుగ్గా పాల్గొనింది. ఇంత యాక్టీవ్ గా ఆమె ఇంటర్వ్యూస్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె తన భర్త రితేష్ దేశముఖ్ గురించి ఆసక్తికరమైన సంఘటనని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘అందరూ నన్ను జూనియర్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాను అని అనుకుంటున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. 2022 వ సంవత్సరం లో నా భర్త దర్శకత్వం లో తెరకెక్కిన మజిలీ మరాఠీ రీమేక్ లో సమంత క్యారక్టర్ చేసాను’.
Also Read: విజయ్ దేవరకొండ కి బ్రదర్ సెంటిమెంట్ కలిసి వస్తుందా..?
‘ఆ సినిమా అక్కడ కూడా భారీ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. సినిమా కెరీర్ కొనసాగించడం ఇష్టమే, కానీ అంతకంటే ముందు కుటుంబం ముఖ్యం కదా. ఈ 13 ఏళ్ళు నా భర్త తో, నా పిల్లలతో గృహిణి గా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాను. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా భర్త గత మూడేళ్ళ నుండి రీ ఎంట్రీ ఇవ్వమని ఇంట్లో టార్చర్ చేస్తూనే ఉన్నాడు. తెలుగు సినిమాల్లో నాకు మళ్ళీ నటించాలని ఉంది. ఎలాంటి క్యారక్టర్ ఇచ్చినా చేస్తాను,చిన్న క్యారక్టర్ అయినా పర్లేదు, కానీ ఏ రోల్ చేసినా చిరకాలం గుర్తుండిపోవాలి, అలాంటి క్యారెక్టర్స్ అయితే కచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా.