Sidharth Malhotra- Kiara Advani Marriage: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు..స్టార్ హీరోయిన్ అవ్వడం అంటే మాటలు కాదు..అందం మరియు టాలెంట్ తో అదృష్టం కూడా బోలెడంత ఉండాలి..ఈ లక్షణాలు అన్నీ కైరా అద్వానీ లో ఎక్కువే..అందుకే ఇండస్ట్రీ కి వచ్చిన 6 ఏళ్లలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ దూసుకుపోతుంది.

సుశాంత్ సింగ్ రాజపుత్ హీరోగా నటించిన ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో వెండితెర కి పరిచయమైనా ఈమె ఆ తర్వాత మన తెలుగు లో భరత్ అనే నేను..వినయ విధేయ రామ వంటి సినిమాలలో హీరోయిన్ గా కనిపించింది..ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..తెలుగు లో ఈమె నటించింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ ఎక్కువ శాతం హిందీ లోనే నటించింది..అక్కడ హీరోయిన్ గా ఈమెకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువే.
అయితే ఈమెకి బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో చాలా కాలం నుండి మంచి రిలేషన్ ఉంది..వీళ్లిద్దరు అక్కడ కొంతకాలం నుండి డేటింగ్ లో కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది..సిద్దార్థ్ మల్హోత్రా తో కైరా అద్వానీ కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించింది..వీళ్లిద్దరి కాంబినేషన్ లో 2021 వ సంవత్సరం లో ‘షేర్ షా’ అనే సినిమా ఒక్కటే విడుదలైంది..కేవలం ఈ ఒక్క సినిమాతోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టేసిందా అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ సినిమాకి ముందే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది..డేటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారట.

ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే వీళ్లిద్దరు ఈ ఏడాది డిసెంబర్ లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే ఇవ్వబోతున్నారట..దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.