Bigg Boss 6 Telugu- Geetu: ప్రతి బిగ్ బాస్ సీసన్ లోను ప్రేక్షకులకు మరియు ఇంటి సబ్యులకు చిరాకు కలిగించే కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు..సోషల్ మీడియా మాధ్యమాలను బాగా గమనిస్తే ఈ సీసన్ లో ప్రేక్షకులు అంతలా చిరాకు తెచ్చుకుంటున్న ఏకైక కంటెస్టెంట్ గీతూ మాత్రమే..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటివరకు ఈమె ప్రవర్తన చూస్తే తపస్సు చేసుకునే ముని కి కూడా కోపం వచేస్తాది.

హౌస్ లో టాస్కులు ఆడడం కంటే కూడా ఎక్కువ శ్రద్ధ గొడవలు పెట్టడం లో సంతృప్తి ని వెతుక్కునే పైశాచిక ఆనందం ఆమె సొంతం అని నెటిజెన్లు అనుకుంటూ ఉన్నారు..ఈమె ఇచ్చే బిల్డుప్స్ మెగాస్టార్ , పవర్ స్టార్ స్థాయి ఉన్నోళ్లు కూడా ఇవ్వరు అని ఆమె పై సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్స్..ఇక ఆలా గీతూ యాటిట్యూడ్ ని ద్వేషించే నెటిజెన్స్ కి ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున మాములు కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.
ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో గీతూ ఎన్ని తప్పులు పొరపాట్లు చేసిందో మన అందరం చూస్తూనే ఉన్నాము..తన గేమ్ చెడిపొయ్యేసరికి ఇంటి సభ్యుల బలహీనతలను గెలికి వాళ్ళని రెచ్చగొట్టి ఆతని చెడిపివేసే ప్రయత్నం చేసింది..అంతే కాకుండా తనకి ఇచ్చిన సంచలక్ టాస్కుని కూడా దారుణంగా ఆడి ‘ఏంటి ఈ అమ్మాయికి మెంటల్ ఎక్కిందా’ అని అందరూ అనుకునేలా చేసింది..సంచలక్ అయ్యుండి కూడా చేపలను పట్టుకొని నేను ఆడిస్తా ఆట అంటూ ఎదో ఆమె ఒక్కటే గేమర్ అయ్యినట్టు..మిగిలిన ఇంటి సభ్యులందరు ఆటలు ఆడడం మానేసి కబుర్లు చెప్తున్నట్టు ఆమెకి ఆమె ప్రాజెక్ట్ చేసుకునే విధానం ని నాగార్జున గారు ఎండగట్టారు.

‘నువ్వు గీతూ లాగా ఆడట్లేదు..పీత లాగ ఆడుతున్నావ్..పీత అంటే ఏంటో తెలుసు కదా..అన్నిటిని గెలికేస్తాది అది..నీకు దానికి పెద్ద తేడా ఎం లేదు’ అంటూ నాగార్జున ఆమె చేసిన తప్పులన్నీ ఎట్టి చూపుతూ తిట్టేసరికి దెబ్బకి ఏడుపు మొహం పెట్టేసింది గీతూ..సంచాలక్ గా ఆమె విఫలం అయ్యేసరికి నాగార్జున ఆమెకి బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరుకు వాష్ రూమ్స్ ని కడిగే శిక్ష ని ఇచ్చాడు.