https://oktelugu.com/

సల్మాన్ ప్రభావం.. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట !

బాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకోవడం అంటే.. అది సామాన్యమైన విషయం కాదు. గ్లామర్ లో టాలెంట్ లో అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన ఛాన్స్ లు రాని వాళ్ళు.. ముంబై గల్లీల్లో ఇంటికొకరు ఉంటారు. ఇంత పోటీలో కూడా క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం ఆమె తన కెరీర్ ను జెట్ స్పీడ్ తో డ్రైవ్ చేసుకుంటూ దూసుకువెళుతుంది. అయితే కియరా అద్వానీకి బాలీవుడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 20, 2021 / 03:31 PM IST
    Follow us on


    బాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకోవడం అంటే.. అది సామాన్యమైన విషయం కాదు. గ్లామర్ లో టాలెంట్ లో అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన ఛాన్స్ లు రాని వాళ్ళు.. ముంబై గల్లీల్లో ఇంటికొకరు ఉంటారు. ఇంత పోటీలో కూడా క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం ఆమె తన కెరీర్ ను జెట్ స్పీడ్ తో డ్రైవ్ చేసుకుంటూ దూసుకువెళుతుంది. అయితే కియరా అద్వానీకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడట. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట.

    Also Read: ‘హిట్-2’ ఫస్ట్ లుక్.. హీరో ఎవరంటే?

    కాగా ఆ సలహానే, తనను ఎప్పుడూ ముందుండి నడిపిస్తుందని చెప్పుకొస్తోంది ఈ బ్యూటీ. ఇంతకీ కండల వీరుడు ఏ సలహా ఇచ్చాడో ? అది ఈ అమ్మడుకు ఎలా ఉపయోగపడుతుందో ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అసలు సల్మాన్ ఆమెకు ఇచ్చిన సలహా ఏమిటంటే.. “కష్టపడి పనిచెయ్, ఫలితం ఆశించకు. నీ కృషే నిన్ను కాపాడుతుంది” అంటూ ఓ పాత సినిమా డైలాగ్ చెప్పుకొచ్చాడట. ఈ సలహానే తనకు ఎంతో ఉపయోగపడుతుందని అంటుంది. మొత్తానికి సినిమా డైలాగ్ లా ఉన్నప్పటికీ సల్మాన్ చెప్పడంతో దానికి వాల్యూ యాడ్ అయింది అన్నమాట.

    Also Read: RRR సీత‌పై కొన‌సాగుతున్న‌ రూమర్లు..!

    పైగా కియారాకు పేరు మార్చుకోమని సూచించింది కూడా సల్మాన్ ఖానే అట. కియరా అసలు పేరు అది కాదు. ఆమె ఒరిజినల్ నేమ్ ఆలియా అద్వానీ. అయితే ఇప్పటికే అలియా భట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అదే పేరుతో వస్తే.. సరైన గుర్తింపు రాదు అని, అందుకే సల్మాన్, ఆమెకు కియారా అంటూ తన శైలిలో పేరు పెట్టాడు. ఇక తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించింది కియారా. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్