https://oktelugu.com/

పాపం మధ్యలో కాజల్ భర్తకే ఇబ్బంది !

సీనియర్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్’ పెళ్లి అయినా, భర్తను దూరం పెట్టి మరీ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయి సంవత్సరం కూడా కాకుండానే ఎందుకు ఇంత బిజీ అవుతున్నావ్ అని ఆమె భర్త అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడట. అయినా కాజల్ కి సినిమాలు, రెమ్యునరేషన్స్ తప్ప.. సంసారం, కుటుంబం పట్టడం లేదట. అందుకే, రిస్క్ షాట్స్ చేయాల్సిన సినిమాలను కూడా కాజల్ రెమ్యునరేషన్ కోసం ఒప్పేసుకుంటుంది. ఇంతకీ కాజల్ మార్షల్స్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటుంది..? చేతిలో […]

Written By:
  • admin
  • , Updated On : March 20, 2021 / 03:44 PM IST
    Follow us on


    సీనియర్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్’ పెళ్లి అయినా, భర్తను దూరం పెట్టి మరీ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయి సంవత్సరం కూడా కాకుండానే ఎందుకు ఇంత బిజీ అవుతున్నావ్ అని ఆమె భర్త అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడట. అయినా కాజల్ కి సినిమాలు, రెమ్యునరేషన్స్ తప్ప.. సంసారం, కుటుంబం పట్టడం లేదట. అందుకే, రిస్క్ షాట్స్ చేయాల్సిన సినిమాలను కూడా కాజల్ రెమ్యునరేషన్ కోసం ఒప్పేసుకుంటుంది. ఇంతకీ కాజల్ మార్షల్స్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటుంది..? చేతిలో మెషీన్ గన్ పట్టుకొని విలన్లను కాలుస్తుంటే ఎలా ఉంటుంది ? అని చూడటానికి నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు.

    Also Read: ‘హిట్-2’ ఫస్ట్ లుక్.. హీరో ఎవరంటే?

    ఇంతకీ కాజల్ లోని యాక్షన్ యాంగిల్ ను చూడాలంటే.. కొన్నాళ్ళు ఆగాల్సిందే. నాగార్జున సరసన చేయబోతున్న సినిమాలో కంప్లీట్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతోంది ఈ ముదురు చందమామ. ఈ మేరకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాజల్ క్యారెక్టర్ పై పూర్తి క్లారిటీ ఇచ్చేస్తూ.. ఆమె క్యారెక్టర్ గురించి తానూ రాసుకున్న సీన్స్ అన్నిటినీ అతను వివరించాడు. అన్నట్టు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రా ఏజెంట్ గా కనిపించబోతోందని.. శత్రువుల దగ్గర నుండి కుట్రల తాలూకు సీక్రెట్స్ ను రాబట్టడానికి వాళ్లతో శారీరక సంబంధం కూడా పెట్టుకుంటుందని మొత్తానికి ఈ సినిమాలో కాజల్ ది కాస్త బోల్డ్ క్యారెక్టర్ అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

    Also Read: RRR సీత‌పై కొన‌సాగుతున్న‌ రూమర్లు..!

    నిజానికి ఈ పాత్రకు పొడుగ్గా ఉండే అమ్మాయి కావాలట, అందుకే మొదట అనుష్కను అనుకున్నారట. నాగార్జున హీరో కాబట్టి.. అనుష్క కూడా కాదనలేదు అనుకున్నారు. కానీ, అనుష్క ఈ సినిమా చేయలేను అని సున్నితంగా ఈ సినిమాకి నో చెప్పేసింది. దాంతో కాజల్ కి ఈ క్యారెక్టర్ దక్కింది. పైగా ఈ పాత్ర కోసం కాజల్ ప్రత్యేకంగా 2 వారాల పాటు రా ఏజెంట్ గా ట్రైనింగ్ కూడా తీసుకోబోతోందట. వైల్డ్ డాగ్ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తి, కాజల్ కు శిక్షణ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పాపం మధ్యలో కాజల్ భర్తనే ఇబ్బంది పడుతున్నాడట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్