Khushi Movie First Look Review : ఖుషి ఫస్ట్ లుక్ రివ్యూ: సమంత రోల్ పై హింట్ ఇచ్చారు!

ఖుషితో పాటు సమంత సిటాడెల్ సిరీస్లో నటిస్తున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సిరీస్లో సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 28, 2023 7:16 pm

samantha

Follow us on

Khushi Movie First Look Review : సమంత బర్త్ డే పురస్కరించుకుని, ఆమె అప్ కమింగ్ మూవీ ఖుషి నుండి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. సమంత ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. టాప్, డెనిమ్ జీన్స్, హై హీల్స్ ధరించిన సమంత లుక్ ట్రెండీగా ఉంది. లెథర్ బ్యాగ్, మెడలో ఐడీ కార్డు ధరించి ఉన్న నేపథ్యంలో ఆమె ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చని అర్థం అవుతుంది. దాదాపు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ఆమె కనిపించే అవకాశం ఉంది. సమంత లుక్ ఆమె డెబ్యూ మూవీ ఏమాయ చేశావే ని తలపించింది. అయితే ఆ మూవీలో సమంత చీరలో కనిపించారు.

మొత్తంగా సమంత లుక్ చాలా మెస్మరైజింగ్ గా ఉంది. చూడగానే నచ్చేసింది. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడిగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శివ నిర్వాణతో సమంతకు రెండో చిత్రం. మజిలీ మూవీలో సమంత హీరోయిన్ గా నటించారు. సమంత-నాగ చైతన్య జంటగా నటించిన మజిలీ సూపర్ హిట్ కొట్టింది.

ఖుషితో పాటు సమంత సిటాడెల్ సిరీస్లో నటిస్తున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సిరీస్లో సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరుపుకుంది. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ చిత్రీకరణ జరపనున్నారు. సిటాడెల్ సిరీస్ నందు సమంతకు శృంగార సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఈ వచ్చే ఏడాది సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని సమాచారం.

సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం నిరాశపరిచింది. సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం దారుణ పరాజయం చవి చూసింది. నిర్మా దిల్ రాజుకు భారీగా నష్టాలు మిగిలినట్లు సమాచారం. ఒక ప్రయత్నం చేశాము, రిజల్ట్ మాత్రం నెగిటివ్ గా వచ్చిందని సమంత పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రేక్షకులు ఆశించే నిర్మాణ విలువలు లేకపోవడం కూడా శాకుంతలం చిత్రానికి మైనస్ అయ్యింది.

https://twitter.com/MythriOfficial/status/1651844560224657408?s=20