Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంత నిజజీవితం ఆధారంగా 'ఖుషి' సినిమా తీశారా ?

Samantha: సమంత నిజజీవితం ఆధారంగా ‘ఖుషి’ సినిమా తీశారా ?

Samantha: ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో సమంతకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇంక ఆమెకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమా విజయ దేవరకొండ తో ‘ఖుషి’. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మజిలీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ‘ఖుషి’ మూవీ కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటి అంటే ఈ సినిమా కథ సమంత నిజజీవిత కథ ఆధారంగా తీసారని. ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత ఆ తరువాత కొద్ది సంవత్సరాలకి ఆ సినిమా హీరో అయినా నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. ఇక ఆ తర్వాత సమంతా కి అనారోగ్యం వల్ల సినిమాలకి కొద్ది రోజులు దూరంగా ఉన్నింది. అంతేకాదు ఆ అనారోగ్యం వల్లే ఖుషి సినిమా కూడా లేట్ అవుతూ వచ్చింది. అయితే కోలుకోగానే వెంటనే సమంత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంది.

ఇక ఈ మధ్యనే ఈ సినిమా యూనిట్ ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. ‘ ఇప్పుడు ఈ క్షణంలో జీవితాన్ని ఖుషీగా గడపాలి’ అనే సందేశాన్నిచ్చే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘ఖుషి’. ఇందులో రెండు వేరు వేరు కులాలకి.. మతాలకి.. చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. అనంతరం మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమయిపోయింది.

ఈ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా సమంత రియల్ స్టోరీతోనే తీసారా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కొనసాగించారు.‌ అంతే కాదు ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం సమంత రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. ముఖ్యంగా వేరువేరు కులాలకి మతాలకి చెందిన నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వంటి అంశాలను ఇందులో రియలిస్టిక్‌గా చూపించినట్లు ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అంతేకాదు ఈ సినిమాలో విడాకులకి కారణం ఏమని చూపిస్తారో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version