https://oktelugu.com/

Thalapathy 68: విజయ్ 68వ సినిమాలో.. ఇద్దరు హీరోలు.. ఇద్దరు హీరోయిన్లు.. ఎవరో తెలుసా..

ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే విజయ్ 68 సినిమాలో ప్రభుదేవా, మాధవన్ కూడా కనిపించబోతున్నారట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుదేవా గతంలో విజయ్‌తో కొరియోగ్రాఫర్‌గా చెయ్యడమే కాదు దర్శకుడిగా కూడా చేశారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 23, 2023 / 07:24 PM IST
    Follow us on

    Thalapathy 68: మాస్టర్, వారసుడు లాంటి సినిమాలతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నారు తమిళ హీరో విజయ్. ఇక లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేయబోతున్న తదుపరి ప్రాజెక్ట్ లియో పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ తరువాత వచ్చే విజయ్ 68వ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే విజయ్ 68 సినిమాలో ప్రభుదేవా, మాధవన్ కూడా కనిపించబోతున్నారట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుదేవా గతంలో విజయ్‌తో కొరియోగ్రాఫర్‌గా చెయ్యడమే కాదు దర్శకుడిగా కూడా చేశారు. తమిళంలో విజయ్ పోకిరి సినిమాకి దర్శకత్వం వహించింది ప్రభుదేవానే. ఇక మాధవన్ తో విజయ్ 2008 షార్ట్ ఫిల్మ్ హీరోవా?జీరోవా? లో కలిసి పనిచేశారు. ఆ షార్ట్ ఫిలిం ని తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇక మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరితో కలవబోతున్నారు విజయ్.

    అంతేకాదు ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా దళపతి విజయ్ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌తో పాటు జ్యోతిక, ప్రియాంక మోహన్‌లు హీరోయిన్లుగా నటించడానికి చర్చలు కొనసాగుతున్నాయట. తండ్రి అయిన విజయ్ సరసన జ్యోతికను పరిశీలిస్తుండగా, ప్రియాంక మోహన్ చిన్న పాత్రతో జతకట్టవచ్చు అని సమాచారం.

    ఈ సినిమాలో జర్నీ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జై కూడా కనిపించనున్నారట. 2002లో వచ్చిన భగవతి చిత్రంలో విజయ్, జై సోదరులుగా నటించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయ్‌తో కలిసి నటించబోతున్నారు జై.

    ఇక ఇంతమంది సెలబ్రెటీస్ బాగం కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.