Khushbu: మాజీ బోల్డ్ హీరోయిన్ ఖుష్బూకి అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు అంటే.. ఫేడ్ అవుట్ అయిపోయి.. క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తోంది అనుకోండి. కానీ, ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఖుష్బూ. పైగా ఖుష్బూ ఇప్పటికీ సినిమాల్లో వరుసగా నటించాలని ఆశ పడుతుంది. దీనికితోడు కేరళాలో కూడా ఖుష్బూకి ఫుల్ క్రేజ్ కూడా ఉంది.

ఇక ఖుష్బూ నుంచి వచ్చిన గత సినిమాలు పెద్దన్న, ఆడవాళ్లు మీకు జోహార్లు పెద్ద డిజాస్టర్ అయ్యాయి. అయినా, ఆ సినిమాల్లో ఖుష్బూ తన పాత్రలతో అదరగొట్టింది. వయసు అయిపోయినా.. తనలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ఘనంగా చాటుకుంది. అందుకే, ప్రస్తుతం ఖుష్బూకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
Also Read: బామ్మర్ధిని గెలిపించడానికి బరిలోకి బావ..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాలో కూడా ఖుష్బూ కీలక పాత్రలో నటించనుంది. ఐతే, ఈ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా చేస్తున్నాం అని ప్రకటించారు గాని, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ? లాంటి అంశాల పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ హరీష్ శంకర్ టీంలో నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. మే నుంచి ఈ చిత్తాన్ని స్టార్ట్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో పవన్ కి అక్క పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. ఇప్పుడు ఆ పాత్రలో ఖుష్బూని తీసుకునే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఖుష్బూ ఖాతాలో మరో భారీ సినిమా పడింది. తనకు వరుస తెలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టే.. ఈ మధ్య తన ఫిజిక్ కూడా తగ్గించింది ఖుష్బూ.

స్లిమ్ గా మారి పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేయడానికి కఠినమైన కసరత్తులు కూడా చేస్తోంది. అయితే, సినిమా ఛాన్స్ లు పెరిగినంత మాత్రానా ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఉండి కుర్ర హీరోయిన్ లా మారిపోతే వచ్చే ఆంటీ పాత్రలు కూడా రావమ్మా అంటూ ఖుష్బూకు కొందరు సినీ ప్రముఖులు సలహాలు ఇస్తున్నారట. అయినా తగ్గేదేలే అంటుంది ఖుష్బూ.
మొత్తానికి ఖుష్బూ తనదైన శైలిలో ముందుకు పోతుంది. పైగా హీరోయిన్ గా అవకాశం రావాలే గానీ, ఇప్పుడు కూడా తానూ గ్లామర్ రోల్స్ లో సై అంటుంది. అన్నట్టు ఖుష్బూ ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది, ఆ ఇబ్బందులను దాటడానికి ఆమె ఇలా మళ్లీ సినిమాల పై ఫోకస్ పెట్టింది.