https://oktelugu.com/

Samantha: అందులో కూడా రాణిస్తాను – సమంత

Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్‌గా కాకుండా వ్యాపారవేత్తగా కూడా సమంత రాణిస్తోంది. సస్టెయిన్ కార్ట్ అనే ఈ-కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థను గతేడాది ప్రారంభించారు. ఇప్పటికే పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్న టాలీవుడ్ హీరోలు, హీరోయిన్‌ల బాటలోనే సామ్ నడుస్తోంది. పైగా ఈ కంపెనీకి సామ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనుంది. మొత్తానికి నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 9, 2022 / 01:50 PM IST
    Follow us on

    Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్‌గా కాకుండా వ్యాపారవేత్తగా కూడా సమంత రాణిస్తోంది. సస్టెయిన్ కార్ట్ అనే ఈ-కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థను గతేడాది ప్రారంభించారు. ఇప్పటికే పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్న టాలీవుడ్ హీరోలు, హీరోయిన్‌ల బాటలోనే సామ్ నడుస్తోంది.

    Samantha

    పైగా ఈ కంపెనీకి సామ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనుంది. మొత్తానికి నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది.

    ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది.

    Samantha

    ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది.

    Tags