https://oktelugu.com/

పూజారే నిందితుడు.. ఆ నేత డబ్బులిచ్చాడు.. విగ్రహ ధ్వంసంలో షాకింగ్ నిజాలు.?

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఆలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం ఘటనల్లో నిందితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులుగా భావించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. విగ్రహాల విధ్వంసం కేసులో వేలల్లో రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరిపై కేసులు సైతం నమోదు చేశారు. ఈ విషయాన్ని గురించిన.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఓ ప్రకటన సైతం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 1, 2021 2:11 pm
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఆలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం ఘటనల్లో నిందితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులుగా భావించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. విగ్రహాల విధ్వంసం కేసులో వేలల్లో రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరిపై కేసులు సైతం నమోదు చేశారు. ఈ విషయాన్ని గురించిన.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఓ ప్రకటన సైతం విడుదల చేశారు.

    రాజమండ్రి శ్రీరాంనగర్ లోని సంకటహర వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని నిత్యం పూజలందుకునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం.. జనవరి 1వ తేదీన.. తెల్లవారుజామున ధ్వంసమైన స్థితిలో కనిపించిన విషయం తెలిసిందే. విగ్రహం రెండు చేతులు పగులగొట్టినట్లు స్థానికులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కేసుల విషయంలో స్పందించిన జగన్ సర్కారు.. విచారణకు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా.. పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును వేగంగా విచారణ చేశారు.

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలో పూజారి మరల వెంకట మురళీ కృష్ణ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. తన చేతుల మీదుగానే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. విగ్రహాన్ని తానే ధ్వంసం చేసినట్లు.. పూజారి మురళీ కృష్ణ అంగీకరించినట్లు.. సిట్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన సైతం విడుదల చేశారు .ఇదే ఘటనలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త మల్ల వెంకటరాజు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్(టీఎన్టీయూసీ) మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వెంకటపతి రాజును సైతం పోలీసులు అరెస్టు చేశారు.

    పూజారి మురళీ కృష్ణ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఈ ఘటనకు పూనుకున్నట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. మరళీ కృష్ణ తన నేరాన్ని అంగీకరించినట్లు.. తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు.. తన దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా.. మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజును అరెస్టు చేసినట్లు వివరించారు. వారిపై 448, 427, 295, 155(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.అయితే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సి ఉందని.. మరికొంత మంది ప్రమేయం ఉండే అవకాశం ఉందని.. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని సిట్ అధికారి.. అశోక్ కుమార్ వివరించారు.