Khaleja re-release collections : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలకు మాత్రమే కాదు, డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా గొప్ప విలువ ఉంటుంది. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణాలు అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా లేకపోవడం వల్లే కానీ, భవిష్యత్తులో తరాలు మారే కొద్దీ ఆ సినిమాలకు క్రేజ్ పెరుగుతుంది అనడానికి బెస్ట్ ఉదాహరణ ‘ఖలేజా'(#KhalejaReRelease). అతడు లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి చేసిన చిత్రమిది. ఆ రోజుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి ఆణిముత్యం లాంటి సినిమాని ఆడియన్స్ ఎలా ఫ్లాప్ చేశారు అంటూ బహిరంగంగా కొంతమంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పడం గతంలో మనం చూసాము.
అలాంటి సినిమాని రీసెంట్ గానే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ మాత్రం రాలేదు కానీ, రీసెంట్ గా విడుదలైన రీ రిలీజ్ చిత్రాలన్నిటికంటే మంచి రెస్పాన్స్ ని మాత్రం తెచ్చుకుంది. మొదటి రోజు 5 కోట్ల 38 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 70 లక్షల రూపాయిల గ్రాస్, మూడవ రోజు 57 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ వసూళ్లు దాదాపుగా 7 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం.
Also Read : 2వ రోజు కూడా ఇరగకుమ్మేసిన ‘ఖలేజా’..నార్త్ అమెరికాలో ప్రభంజనం..ఇప్పట్లో ఆగేలా లేదు!
ఓవరాల్ గా టాప్ 5 రీ రిలీజ్ చిత్రాల్లో ‘ఖలేజా’ ఏ స్థానం లో ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా మురారి చిత్రం 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ చిత్రం ఖుషి 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ తో కొనగతుండగా, నాల్గవ స్థానం లో ఖుషి చిత్రం 7 కోట్ల రూపాయిల గ్రాస్ తో కొనసాగుతుంది. ఇలా మహేష్ బాబు పాత సినిమాల రీ రిలీజ్ లు బాగా క్లిక్ అవుతుండడంతో ఇప్పుడు ఆయన కెరీర్ లో ఫ్లాప్ గా నిల్చిన ‘టక్కరి దొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారట.