Mahesh Rajamouli IMAX dream Hyderabad : హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ కి కొదవే లేదు. అన్ని రకాల ఫార్మటు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ మన హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక్క ఐమాక్స్(Imax Theatres) థియేటర్స్ తప్ప. అదేంటి ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో ఐమాక్స్ ఉంది కదా?, మరి ఐమాక్స్ థియేటర్స్ లేదని అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. అవి పేరుకు మాత్రమే ఐమాక్స్. చాలా పెద్ద తెర ఉంటుంది కానీ, పిక్చర్ క్వాలిటీ మాత్రం ఐమాక్స్ రేంజ్ లో ఉండదు. ఐమాక్స్ స్క్రీన్ పై సినిమాలోని ప్రతీ డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే భూతద్దం పెట్టి చూస్తే ఎంత క్లారిటీ గా కనిపిస్తుందో అంత క్లారిటీ తో అన్నమాట. సినిమా ని చూస్తున్న ప్రేక్షకులకు ఎదో సినిమాని చూస్తున్న అనుభూతి ఇవ్వదు. ఆ సినిమా కథలోకి మనం ప్రవేశించిన ఫీలింగ్ ని కలిగిస్తుంది ఐమాక్స్ థియేటర్స్.
అలాంటి ఐమాక్స్ థియేటర్స్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై,పూణే ఇలా అన్ని సిటీస్ లో ఉన్నాయి కానీ, హైదరాబాద్ లో మాత్రం లేదు. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఏషియన్ థియేటర్స్ సంస్థ ప్రస్తుత అధినేత సునీల్ నారంగ్(Suneel Narang). హైదరాబాద్ లోని హకీమ్ పేట్ లో ఐమాక్స్ థియేటర్స్ ని తీసుకొని రాబోతున్నదట. దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ తో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా హైదరాబాద్ కి వచ్చి ఐమాక్స్ లో సినిమా చూసే విధంగా తీర్చిదిద్దబోతున్నారట. ఈ ఏడాది లోనే నిర్మాణ పనులు మొదలు పెట్టి, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పూర్తి అయ్యేలోపు ఈ ఐమాక్స్ ని రెడీ చెయ్యాలని అనుకుంటున్నారట. అంటే ప్రేక్షకులు మహేష్(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) మూవీ ని ఐమాక్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది.
Also Read : ఇద్దరిలో ఎవరి ఓడినా గుండె ఆగిపోతుంది అంటూ డైరెక్టర్ రాజమౌళి సంచలన పోస్ట్!
2027 వ సంవత్సరం లోపు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్రణాళికలు చేస్తున్నాడు. ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఏషియన్ సునీల్ హైదరాబాద్ లో థియేటర్స్ విషయం లో ఇప్పటికే తనదైన మార్క్ చూపించాడు. స్టార్ హీరోలతో చేతులు కలిపి కొన్ని థియేటర్స్ ని నిర్మించాడు. మహేష్ బాబు తో కలిసి AMB మాల్, అల్లు అర్జున్ తో కలిసి AAA, విజయ్ దేవరకొండ తో కలిసి AVD , రవితేజ తో కలిసి ART వంటి మాల్స్ ని ప్రారంభించాడు. వీటికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అదే తరహా లో ఆయన ఈ ఐమాక్స్ థియేటర్స్ విషయం లో కూడా తనదైన మార్కు ని ఏర్పాటు చేస్తాడని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.