Khaleja Re Release Day 2 Collection: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెరీర్ లో కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చినప్పటికీ, కాలక్రమేణ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ఖలేజా(Khaleja 4k Movie). 2010 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ ని థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయింది. కానీ టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ సాధారణమైనది కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అద్భుతమైన డైలాగ్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్, సినిమాలోని ముఖ్యమైన కాన్సెప్ట్ నేటి తరం ఆడియన్స్ కి విపరీతంగా ఎక్కేసింది. అందుకే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే అంచనాతో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు.
Also Read: ‘అర్జున్ రెడ్డి’ ని వదులుకోవడానికి కారణం అదేనంటూ మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!
రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 5 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 2 రికార్డు గా చెప్పుకోవచ్చు. మొదటి స్థానం లో గబ్బర్ సింగ్ చిత్రం 7 కోట్ల 53 లక్షల రూపాయిలతో కొనసాగుతుంది. ఇక రెండవ రోజు కూడా ఖలేజా చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. కేవలం నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ సెన్సేషన్ ని నెలకొల్పింది అనేది. ఇక రెండవ రోజు హైదరాబాద్, వైజాగ్, గుంటూరు మరియు ఇతర ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్ళు నమోదు అయ్యాయి.
బుక్ మై షో లో ఈ చిత్రానికి 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజుకి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉంది అనేది. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 6 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చి ఆల్ టైం టాప్ 3 చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కొత్తగా విడుదలైన ‘భైరవం’ మూవీ కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తూ ఈ చిత్రం సృష్టిస్తున్న భీభత్సాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.