Akhil wedding expenses : అక్కినేని అఖిల్(Akkineni Akhil) పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజుల నుండి ఏ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. అఖిల్, జైనబ్(Zainab Ravdjee) జంట చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉందని, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తుందని సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున కొడుకు పెళ్లి అంటే అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులు కూడా ఎంతో గ్రాండ్ గా జరిపిస్తాడని ఊహిస్తారు. ఎందుకంటే నాగార్జున దేశంలోనే అత్యంత ధనికులలో ఒకరు. ఒక సినీ హీరో గా కంటే వ్యాపారవేత్తగా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే నాగార్జున(Akkineni Nagarjuna) ఎందుకో తన ఇద్దరి కొడుకుల వివాహాలను చాలా సింపుల్ గా చేసేశాడు అని అనిపించింది. అతిథులను కూడా కేవలం తనకు సన్నిహితం ఉన్నవారినే పిలిచాడు.
అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ పెళ్లి సెట్టింగ్ వేసి చాలా సింపుల్ గా జరిపించాడు. ఇక అఖిల్, జైనబ్ జంట పెళ్లి అయితే సరేసరి..తన సొంత ఇంట్లోనే కూర్చోబెట్టి వివాహం జరిపించాడు. నాగార్జున తల్చుకుంటే దేశం మొత్తం రీ సౌండ్ వచ్చేలా తన కొడుకుల వివాహాలను జరిపించగలడు. కానీ ఎందుకు ఇంత సింపుల్ గా కానిచ్చాడంటే తన ఇద్దరి కొడుకులకు చాలా సింపుల్ గా వివాహం చేసుకోవడమే ఇష్టమట. నాగ చైతన్య ఎంత సింప్లిసిటీ తో బ్రతుకుతాడో మనమంతా చూసాము, అఖిల్ కూడా అంతే సింప్లిసిటీ తో ఉంటాడని ఇప్పుడే తెలిసిందే. అయితే ఇంత సింపుల్ గా వివాహం జరిపించినప్పటికీ నాలుగు కోట్ల రూపాయిల ఖర్చు అయ్యిందట. ఈ నాలుగు కోట్ల రూపాయిలు కేవలం పెళ్ళికి మాత్రమే కాదు, నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన రిసెప్షన్ తో కలిపి అట.
Also Read : వైభవంగా అఖిల్ అక్కినేని-జైనబ్ రిసెప్షన్… హాజరైన స్టార్స్, వైరల్ ఫోటోలు
నాలుగు కోట్ల రూపాయిలు అంటే ఒక మీడియం రేంజ్ సినిమానే తీసేయొచ్చు. పెద్దవాళ్ళ పెళ్లిళ్లు అంటే ఆ మాత్రం ఖర్చు కాకపోతే ఎలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన జీవితంలోకి కొత్త వాళ్ళు అడుగుపెట్టినప్పుడు మనకు తెలియకుండానే చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అఖిల్ కి ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. ఇప్పుడు జైనబ్ ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కెరీర్ పరంగా కూడా ఇక మీదట విజయాలను చూస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగ చైతన్య కి కూడా వరుసగా ఫ్లాప్స్ ఈమధ్య కాలం లో వచ్చాయి. కానీ శోభిత ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ‘తండేల్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే సెంటిమెంట్ అఖిల్ కి కూడా రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు.