Khaleja : రీ రిలీజ్ చిత్రాల్లో అత్యధిక రికార్డ్స్ ఉన్న హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu). అసలు ఈ ట్రెండ్ ని మొదలు పెట్టిందే మహేష్ బాబు ఫ్యాన్స్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘పోకిరి’ సినిమాతోనే మొదలైన ఈ ట్రెండ్, ఆ తర్వాత ‘జల్సా’ తో తారాస్థాయి కి చేరుకుంది. ఈ రెండు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో మిగిలిన హీరోల అభిమానులు కూడా తన తమ అభిమాన హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ ఏ రేంజ్ కి వెళ్లిందంటే కొత్తగా విడుదలయ్యే మీడియం రేంజ్ హీరోల సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టే రేంజ్ కి వెళ్ళిపోయింది. మన టాలీవుడ్ లో అత్యధిక రీ రిలీజ్ రికార్డ్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకే ఉన్నాయి.
Also Read : షాక్ అయ్యేలాగా మారిపోయిన ఖలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య…
ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన చిత్రం ‘ఖలేజా'(Khaleja Re Release). ‘అతడు’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ చేసిన ఈ చిత్రం ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై చతికిల పడింది. కానీ కాలం గడిచే కొద్దీ, రిపీట్ టీవీ టెలికాస్ట్ కారణంగా ఈ చిత్రం నేటి తరం ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. అసలు ఆరోజుల్లో ఈ సినిమాని ఎలా ఫ్లాప్ చేశారు రా బాబు అని ఇప్పటికీ మన ఆడియన్స్ ని ఈ చిత్రాన్ని చూసినప్పుడల్లా తిట్టుకుంటూ ఉంటారు నేటి తరం సినీ అభిమానులు. ఈ చిత్రం రీ రిలీజ్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ కంటే ఎక్కువగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ ఈ చిత్రాన్ని ఈ నెల 30న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మహేష్ ‘అతడు’ చిత్రం 3 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది ఆల్ టైం రికార్డు. ఇప్పుడు ఖలేజా కూడా రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఆల్ టైం నాన్ అతడు రికార్డు గా పరిగణించొచ్చు. వాస్తవానికి ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, లేదా విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రాలలో ఎదో ఒకటి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ రెండు సినిమాలలో ఏది వచ్చినా ‘ఖలేజా’ ని వాయిదా వేద్దామని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాలు ఆ తేదిన రావట్లేదు అనే క్లారిటీ రావడంతో ఖలేజా రీ రిలీజ్ అవుతుంది. అదే రోజున ‘భైరవం’ సినిమా కూడా రానుంది. దీని ప్రభావం ‘ఖలేజా’ పై ఉండకపోవచ్చు.
Also Read : సినిమాలో డి గ్లామర్ లుక్.. బయట మాత్రం అందాల అరాచకం…