Hari Hara Veera Mallu: కోట్లాది మంది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. నేడే ఈ చిత్రానికి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ డీల్ క్లోజ్ అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపుగా 120 కోట్ల రూపాయలకు ఈ డీల్ లాక్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ట్రైలర్ కట్ విషయం లో మూవీ కసరత్తులు చేస్తుంది. నేడు సాయంత్రం విడుదల తేదీని ఖారారు చేయబోతున్నారట. ముందుగా ఈ చిత్రాన్ని మే 30 న విడుదల చేయబోతున్నట్టు ఒక టాక్ వినిపించింది. ఆ తర్వాత జూన్ 12 న కూడా విడుదల చేయబోతున్నట్టు మరో టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ రెండు తేదీలలో ఈ చిత్రం రావడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
Also Read: సీరియల్ లోని సన్నివేశాన్ని ‘హిట్ 3’ లో వాడేసారా..? ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారుగా!
నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని జూన్ 27 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట. అందుకు సంబంధించిన అన్ని చర్చలు కూడా పూర్తి అయ్యాయట. అయితే అదే రోజున మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ని విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే ఒక అధికారిక ప్రకటన చేసాడు. ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడం తో మే 27 కి వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యే రోజున కన్నప్ప చిత్రాన్ని కూడా విడుదల చేయడం అనేది పెద్ద సాహసమే. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే కచ్చితంగా ‘కన్నప్ప’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అనేది వాస్తవం. ప్రభాస్ ఈ చిత్రం లో ఉన్నాడు కనుక ఆయన కారణంగా పరువు పోయే కలెక్షన్స్ మాత్రం రావు అని చెప్పొచ్చు.
కానీ ‘కన్నప్ప’ కూడా పెద్ద సినిమానే. ఈ చిత్రం కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడు మంచు విష్ణు. కాబట్టి థియేటర్స్ ఈ సినిమాకు కూడా భారీగానే దొరుకుతాయి. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే ఓపెనింగ్ రికార్డ్స్ ‘హరి హర వీరమల్లు’ కి రావు. అలా జరగకుండా ఉండాలంటే ‘కన్నప్ప’ చిత్రాన్ని వాయిదా వేయక తప్పదు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా, సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది, కాబట్టి కన్నప్ప కి టికెట్ రేట్స్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ‘హరి హర వీరమల్లు’ బలంగా వచ్చే నెల 27 న రావాలని అనుకుంటే, ‘కన్నప్ప’ ని వాయిదా వేయక తప్పదు, కానీ మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి ఇది న్యాయమా అని గొడవ చేసే అవకాశం ఉందని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే రెండు సినిమాలకు బోలెడంత పబ్లిసిటీ వస్తుందని మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.