AlluArjun Fitness Trainer :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఒక గ్రాండ్ వీడియో ద్వారా అధికారికంగా తెలిపారు. ఆ వీడియో ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో తెలిసిందే. స్టార్ హీరోల టీజర్స్ విడుదలైతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, అలాంటి రెస్పాన్స్ ఈ వీడియో కి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ అభిమానులకు ఈ వీడియో రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తే, ఆయన దురాభిమానులను కుల్లుకునేలా చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి రోజుకి ఒక అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో హీరో ఆయనే మెయిన్ విలన్ కూడా ఆయనే.
Also Read : ‘వర్షం’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ‘యమదొంగ’ అవుట్!
ఈ చిత్రం లో ఏకంగా 5 మంది హీరోయిన్స్ నటించబోతున్నారని టాక్. అందులో ఇప్పటికే దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఖరారు అయ్యారు. నాల్గవ హీరోయిన్ కోసం భాగ్యశ్రీ భోర్సే ని సంప్రదిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచనున్నాడు. మన అందరికీ తెలిసిందే సౌత్ ఇండియా లో మొట్టమొదట సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జునే అని. అప్పటి వరకు కేవలం నార్త్ ఇండియా లోనే హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ కోసం వర్కౌట్స్ చేసేవారు. ఒక హీరోయిన్ మీ సౌత్ హీరోలకు అంత సినిమా లేదని అల్లు అర్జున్ ముందు అనడంతో, ఆయన పట్టుదలతో సిక్స్ ప్యాక్ బాడీ వచ్చేలా ప్రయత్నాలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఈమధ్య కాలం లో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ పై పెద్దగా శ్రద్ద పెట్టలేదు.
కానీ అట్లీ చిత్రం కోసం ఆయన హాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ జిమ్ ట్రైనర్ వద్ద రీసెంట్ గానే చేరాడు. ఆ జిమ్ ట్రైనర్ చేస్తున్న వర్కౌట్స్ ని చూసి అల్లు అర్జున్ అభిమానులు నోరెళ్లబెట్టారు. దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. ఈయనే ఈ రేంజ్ లో ఉంటే ఇక అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో తయారు చేస్తాడో అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు పాత్రల్లో, ఒక పాత్ర కోసం ఆయన బల్క్ బాడీ తో కనిపించబోతున్నాడట. అభిమానులు కలలో కూడా ఊహించని లుక్ లాగా ఉంటుందని, ఆ రేంజ్ లో అల్లు అర్జున్ తన శరీరాన్ని మార్చుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
#AlluArjun‘s fitness trainer Lloyd Stevens is crafting an intense workout regimen for his massive transformation in #AA22, directed by #Atlee. pic.twitter.com/2x97j3OABK
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 23, 2025