Tollywood Heroine : చాలామంది భయపడుతూనే సినిమాను పూర్తిగా చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హారర్ సినిమాలంటే చాలామందికి ఇష్టం. ఈ నేపథ్యం లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. అలా ప్రేక్షకులను అలరించిన హారర్ సినిమాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి. డైరెక్ట్ గా ఈ సినిమా ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటిలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Also Read : షాక్ అయ్యేలాగా మారిపోయిన ఖలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య…
ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి లో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధిస్తుంది అని ఎవరు ఊహించలేదు. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఈ సినిమా మేకర్స్ మా ఊరి పొలిమేర 2 సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. భోగేంద్ర గుప్తా ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. డాక్టర్ అనిల్ విశ్వనాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ భార్యగా కామాక్షి భాస్కర్ల నటించడం జరిగింది. అలాగే గెటప్ శ్రీను భార్యగా డి గ్లామర్ లుక్ లో నటించినా బ్యూటీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వయ్యారి పాత్ర సినిమాలో చాలా కీలకము. రాములు అనే పాత్రలో నటించిన ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిన్నదాని పేరు సాహితీ దాసరి. మా ఊరి పొలిమేర సినిమాతో సాహితీ దాసరికి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లోకి రాకముందే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ గా ఈమెకు సామాజిక మాధ్యమాలలో బాగా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తోనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. గాయిని సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చిన్నచిన్న సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న సాహితీ దాసరి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది. తాజాగా సాహితీ దాసరికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
Also Read : ఈ అందాన్ని చూస్తే మతి పోవాల్సిందే…
View this post on Instagram