Revanth Reddy- Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరుగుతోంది. జగ్గారెడ్డి,వీహెచ్ లు తమను పార్టీ కోవర్టులుగా చిత్రీకరిస్తున్నారంటూ విభేదిస్తున్నారు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో వారిలో అసమ్మతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇక పార్టీలో ఉండలేమని చెబుతున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకున్నా అవి ఫలించడం లేదు. మూడు రోజులుగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయంలో మార్పు ఉండదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. తమ కుటుంబ సమస్యను తామే పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. జగ్గారెడ్డి, వీహెచ్ ల పై వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి త్వరలో చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను వదులుకోమంటున్నారు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?
కొద్ది రోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీరుపై విసిగిపోయిన నేపథ్యంలో తనలో ఉన్న అక్కసును వెళ్ల గక్కుతున్నారు. తన పై చేస్తున్న విమర్శలకు తట్టుకోలేకపోతున్నానని చెబుతున్నారు. అందుకే పార్టీని వీడాలని బావిస్తున్నట్లు సూచనలు చేశారు. దీనిపై అధిష్టానంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సీనియర్ నేతలను దూరం చేసుకుంటే పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడిగా అందరిని కలుపుకుని పోతానని స్పష్టం చేస్తున్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో అందరి సహకారం అవసరం అయినందున ఎవరిని పార్టీ నుంచి వెళ్లనివ్వమని తెలుస్తోంది. దీనిపై అధిష్టానంతో సంప్రదించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీని ముందుకు నడిపించడంలో సఖ్యత సాధిస్తామని రేవంత్ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది.