Writer Movie: కామెడీ పాత్రైనా, విలన్‌గా భయపెట్టాలన్నా.. ఎమోషనల్‌గా రక్తి కట్టించాలన్నా.. ఇలా పాత్రేదైైనా సరే అందులో తనను తాను మర్చిపోయి ఇట్టే ఒదిగిపోయే నటుడు సముద్రఖని. తాజాగా ఈ విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా రైటర్. పా. రంజిత్ సమర్పణలో నీలమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్లాంక్లిన్ జాకబ్దర్శకత్వంలో వస్తోన్న సినమా ఇది. ఓ పోలీస్ స్టేషన్లో సాధారణ రైటర్‌గా చేరిన సుముద్రఖని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, రాజకీయ వ్యవస్థలోని అరాచకాలను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ఈ సినిమా కథాంశం.
Also Read: అదే జరిగితే ‘నాని’ స్థాయి సగం పడిపోయినట్టే !
తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన పా. రంజిత్.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తను కథలు రూపొందిస్తానని అన్నారు. తన భావాలకు దగ్గరైన వ్యక్తులనే ఆఫీసులోకి అనుమతిస్తానని స్పష్టం చేశారు. కబాలి, కాలా, సార్పట్టా వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈయన.. నిర్మాతగా మారి కొత్త దర్శకులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంతో విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా, ఇటీవలే ఆకాశవాణి సినిమాతో వచ్చిన సముద్రఖని.. అందులో అడవిలో జీవించేవారి జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి పాత్రలో కనిపించారు. కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. కాగా, కఠారి కృష్ణగా క్రాక్ సినిమాలో కనిపించి విలన్ అంటే ఇలా ఉండాల్రా అన్నట్లు నటించారు. ఇక జయమ్మతో లవ్‌ట్రాక్ కూడా అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు సముద్రఖని.
Also Read: రాధేశ్యామ్ నుంచి మరో సాలిట్ అప్డేట్.. ట్రైలర్ ఎలా ఉండనుందంటే?