KGF 2 Telugu Movie Dialogues: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు తెలుగులో చాలా ఫేమస్. ఈ మధ్య సాయిమాధవ్ బుర్రా కూడా బాగానే డైలాగులు రాస్తున్నారు. కానీ వీటికి మించి ఇప్పుడు పదాల పొందిక కుదిరింది. కేజీఎఫ్2 సినిమాలో చెప్పిన డైలాగ్స్ గూస్ బాంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమాకే డైలాగ్స్ హైలెట్ అని ప్రేక్షకులు కొనియాడుతున్నారు..
యశ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 చిత్రం అంచనాలకు మించి పాజిటివ్ టాక్ తో రికార్డ్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. క్లాస్ మాస్ తేడా లేకుండా సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొన్ని డైలాగ్స్ అయితే సినిమాకు ప్రాణం పోశాయని అంటున్నారు. ప్రేక్షకులకు గూస్ బాంప్స్ తెప్పిస్తున్నాయి. ఇవి విని ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు.. ఇవి మాటలా లేక తూటాలా? అని అందరూ కొనియాడుతున్నారు.
షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్ మొదటి పార్ట్ డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. అందుకే.. ఈ సినిమా సీక్వెల్ డైలాగ్స్ పై కూడా ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, `కేజీఎఫ్ చాప్టర్- 2`లో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ మీ కోసం…
KGF 2 Telugu Movie Dialogues
1. కేజీఎఫ్ లో గరుడని చంపేసిన తర్వాత ఏమి జరిగింది ? మీరు చదువుతారా ?

2. రక్తంతో రాసిన కథ ఇది..! సిరాతో ముందుకి తీసుకెళ్ళలేవ్. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్నే అడుగుతుంది.

3. నా దగ్గర సైన్యం ఉంది. గూస్ కె మారెంగే!

4. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది..వినాశానికి కాదు..! ఉద్దరించడానికి ..!

KGF2 Dialogues Lyrics Telugu
5. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులని అడుగు !

6. హీ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీ ఈజ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ మెన్. దీజ్ ఆర్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యుస్ .

7. వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్ .. . ఐ డోంట్ లైక్ వైలెన్స్. ఐ అవాయిడ్ వైలెన్స్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. సో.. ఐ కాంట్ అవాయిడ్.

8. నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటూ!

9. చెప్పు వాళ్లకు నేను వస్తున్నాను అని. నా కేజీఎఫ్ నేను దక్కించుకోవడానికి.

10. నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.! నాతో సుష్మని ఎవ్వడు తట్టుకోలేడు.

11. బిజినెస్ చేద్దామా ? ఆఫర్ క్లోజెస్ సూన్ !

12. అమ్మ నీకు ప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంత తెచ్చి ఇస్తాను అమ్మ !

13. ‘నా కొడుకు శవాన్ని ఎవరూ మోయాల్సిన అవసరం లేదు. వాడి కాళ్లే వాడిని సమాధి దగ్గరకు తీసుకెళుతాయి’
14. దేశం అప్పు తీర్చాలా చెప్పేయండి తీర్చేస్తాను’
15. మిమ్మల్ని మంచి చేయనివ్వరు.. నన్ను మంచోడిని అవ్వనివ్వరు..
16. ఇక్కడ తలలు శాశ్వతం కాదు.. కిరీటాలే శాశ్వతం’
17. నెపోటిజం నెపోటిజం నెపోటిజం.. మెరిట్ ను ఎదగనివ్వరా?’
18. ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు.. వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు.. ఊరిని ఆక్రమిస్తే నా సమస్య కాదు.. అనుకోవడం వల్లే బ్రిటీష్ వాళ్లు దేశాన్ని ఆక్రమించారు
19. చరిత్రలు, పురాణాలు చెబుతున్నాయి ఆడదానికి క్రోదం వస్తే చెయ్యి చేసుకోకూడదు అలంకరించి బొట్టు పెట్టి పూజ చేసి దండం పెట్టాలి’..
20. నాకీ చరిత్రమీద నమ్మకం లేదు జరిగిందొకటి అయితే రాయించింది ఇంకొకటుంది వాళ్లు చెప్పింది విని రాయొద్దు కళ్లారా నువ్వే చూసి రాయి దానికో విలువుంటుంది’
ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ షాట్స్ అండ్ బిల్డప్ షాట్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా యశ్ చెప్పిన డైలాగ్ లు చాలా బాగున్నాయి.
ఇక ఈ కథలోని కీలక సంఘటనల గురించి ప్రకాష్ రాజ్ ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ ట్రైలర్ ప్రేక్షకులపై గట్టి ముద్రనే వేసింది. మెయిన్ గా విజువల్స్ అత్యున్నతంగా ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ అలరిస్తాయి. పైగా కీలక పాత్రలను దర్శకుడు చాలా చక్కగా డిజైన్ చేశాడు.
దీనికితోసు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ స్థాయిని పెంచింది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గనులు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.