https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: బంధాన్ని తట్టిలేపి కంటెస్టెంట్లను ఏడిపించిన బిగ్ బాస్

Bigg Boss Telugu OTT: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా దూసుకెళుతోంది. డే వ‌న్ నుంచి ప్రెక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఎన్నో గొడ‌వ‌లు, కంటెస్టెంట్స్ ఎమోష‌న్స్, టాస్క్ లలో పైట్ లు, ఎలిమినేష‌న్స్ లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఇలా అన్ని ర‌కాలుగా టెన్ష‌న్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులను ఆనంద‌పరుస్తూ.. టాస్క్ లు పెట్టి  కంటెస్టెంట్లను ఏడిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏడోవారం కొన‌సాగుతోంది. కాగా మొత్తం 17 […]

Written By:
  • Admin
  • , Updated On : April 16, 2022 / 03:46 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా దూసుకెళుతోంది. డే వ‌న్ నుంచి ప్రెక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఎన్నో గొడ‌వ‌లు, కంటెస్టెంట్స్ ఎమోష‌న్స్, టాస్క్ లలో పైట్ లు, ఎలిమినేష‌న్స్ లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఇలా అన్ని ర‌కాలుగా టెన్ష‌న్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులను ఆనంద‌పరుస్తూ.. టాస్క్ లు పెట్టి  కంటెస్టెంట్లను ఏడిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏడోవారం కొన‌సాగుతోంది. కాగా మొత్తం 17 మందిలో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, సరయు, తేజస్వి, ఆర్జే చైతు, స్రవంతి.. ఈ ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.

    Bigg Boss Telugu OTT

    ముమైత్ ఖాన్ ను ఒకసారి ఎలిమినేట్ చేసి.. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ హౌస్‌లోకి తీసుకుని వచ్చి.. మళ్లీ ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌస్ లో ఇంకా 11 మంది కొన‌సాగుతున్నారు. కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ప్రోమోలో తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని తోటి సభ్యులతో పంచుకున్నారు.

    Also Read: Devi Sri Prasad-Charmi Marriage: చార్మి – దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అతడేనా??

    ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ కుటుంబ స‌భ్యుల‌తో దిగిన చిన్న‌నాటి ఫొటో ప్రెమ్ ప‌ట్టుకుని ఒకరి తర్వాత మరొకరు తమ చిన్న నాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. కన్నీళ్లు కార్చే సంగతులు గుర్తుకొస్తున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. నటరాజ్ మాస్టర్, శివ, అఖిల్, మ‌హేశ్ విట్టా, బింధు మాధ‌వి ఇలా అందరూ తమ విషయాలు చెప్తూ కన్నీళ్లు కార్చారు. నటరాజ్ మాస్టర్.. తన గురువైన ప్రభు మాస్టర్ తో ఉన్న అనుబంధం గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. బిందు మాధవి తన అన్నయ్య ను చాలా మిస్ అవుతున్నానని ఏడ్చేసింది.

    Bigg Boss Telugu OTT

    మ‌హేశ్ విట్టా త‌ను చిన్న‌ప్పుడు దిగిన ఫొటో ప్రేమ్ ను చూపిస్తూ చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నాడు. అషురెడ్డి త‌న చిన్న‌ప్ప‌టి ఫొటో చూపిస్తూ ఎమోష‌న‌ల్ అయింది. ఇక మరో కంటెస్టెంట్ నేను మా సొంత త‌ల్లిని ఎప్పుడూ చూడ‌లేదంటూ ఆమె చేయిని మాత్ర‌మే చూసాన‌ని చెప్పింది. ఆ త‌ర్వాత అనిల్ మాట్లాడుతూ త‌న మ‌మ్మి ప్రే చేస్తే పుట్టాన‌ని.. త‌న అన్న‌య్య చిన్న‌ప్పుడే చ‌నిపోయాడ‌ని ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇలా ఇంటి సభ్యులందరూ తమ చిన్న నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ ఎపిసోడ్ అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసింది.

    Also Read:KGF VS RRR: ‘కేజీఎఫ్’ కోసం ‘ఆర్ఆర్ఆర్’పై విషం..!

     

    https://www.youtube.com/watch?v=s0__Xm8RIC4

    Tags