https://oktelugu.com/

Kgf 2 Movie: ఆ డేట్ కి క్రేజీ అప్డేట్ ను ఇవ్వనున్న… కేజీఎఫ్ 2 టీమ్

Kgf 2 Movie: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన మూవీ ‘కేజీఎఫ్’. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న చిత్రం కేజీఎఫ్ 2. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించి సంచలన హిట్ అయ్యింది ఈ మూవీ. ఈ చిత్రంతో హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం కోసం ప్రేక్శకులు ఎంతగానో ఎదురు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 04:45 PM IST
    Follow us on

    Kgf 2 Movie: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన మూవీ ‘కేజీఎఫ్’. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న చిత్రం కేజీఎఫ్ 2. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించి సంచలన హిట్ అయ్యింది ఈ మూవీ. ఈ చిత్రంతో హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం కోసం ప్రేక్శకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.   

    ఈ ఏడాది ఈ మొబిఏ రిలీజ్ కావాల్సి ఉండగా కరోన కారణంగా 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైం కూడా కాస్త తక్కువే ఉంది. మరి ఈ గ్యాప్ లో మేకర్స్ అప్డేట్స్ ఇచ్చే సమయం కూడా ఆరంభం కానుంది. అయితే ఇది ఓ బిగ్ అప్డేట్ తో స్టార్ట్ కానున్నట్టు క్రేజీ బజ్ వినిపిస్తుంది. హీరో యష్ లాస్ట్ బర్త్ డే కి అదిరే టీజర్ కట్ ని లాంచ్ చెయ్యగా దానికి ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి రాని రెస్పాన్స్ వచ్చింది.

    ఇక నెక్స్ట్ బర్త్ డే కే అంటే మళ్ళీ జనవరి 8కి ఈ చిత్రం నుంచి సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ క్రేజీ బజ్ ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ , ప్రకాష్ రాజ్, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.