https://oktelugu.com/

‘రాధేశ్యామ్‌’లో కీలక మార్పు!

బాహుబలితో నేషనల్‌ స్టార్ గా మారిపోయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ వస్తోంది. అతని గురించి, అతని సినిమాల గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అభిమానుల ముందుకు రాబోతోంది. లాక్‌డౌన్‌ ముందు వరకూ జార్జియాలో షూటింగ్‌ చేశారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 10:36 AM IST
    Follow us on


    బాహుబలితో నేషనల్‌ స్టార్ గా మారిపోయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ వస్తోంది. అతని గురించి, అతని సినిమాల గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అభిమానుల ముందుకు రాబోతోంది. లాక్‌డౌన్‌ ముందు వరకూ జార్జియాలో షూటింగ్‌ చేశారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. పోస్టర్ ప్రభాస్‌,పూజా రొమాంటిక్‌ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. సాహో నిరాశ పరచడంతో ఈ మూవీతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని ప్రభాస్‌ చూస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీ పీరియాడికల్‌ డ్రామాగా.. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

    మహేశ్‌ మెచ్చిన మూవీ రీమేక్‌లో విశ్వక్‌సేన్!

    ఈ మూవీకి గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటికొచ్చింది. ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందంలో కీలక మార్పు జరిగిందని సమాచారం. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి తొలుత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని ఫైనల్‌ చేశారు. బాలీవుడ్‌ పలు హిట్‌ చిత్రాలకు పని చేసిన అమిత్‌…‘సైరా నరసింహారెడ్డి’కి మ్యూజిక్‌ అందించాడు. అలాగే, నాని ‘వీ’ మూవీకి కూడా పని చేశాడు. కానీ, ఫస్ట్ లుక్‌ పోస్టర్లో అమిత్‌ కనిపించలేదు. దాంతో, అమిత్‌ను కూడా పక్కనబెట్టారని తెలుస్తోంది. ఈ మూవీ మ్యూజిక్‌ బాధ్యతలు టాలీవుడ్‌ టాప్‌ కంపోజర్ ఎస్‌ ఎస్‌ తమన్‌కు అప్పగించాలని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చిందని టాలీవుడ్‌ టాక్‌. టాలీవుడ్‌లో ఈ మధ్య తమన్‌ హవా నడుస్తోంది. రీసెంట్‌గా ‘అలవైకుంఠపురములో’తో భారీ మ్యూజికల్‌ హిట్‌ అందుకున్నాడు తమన్‌. దాంతో, రొమాంటిక్‌ మూవీకి తమన్‌తో బాణీలు సమకూర్చుకోవాలని ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై తొందర్లోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే చాన్సుంది.