పరాన్న జీవి.. ఆర్జీవీ.. ఇప్పుడు డేరా బాబా

తన, మన, పర అన్న తేడా లేకుండా అందరినీ కెలికేస్తుంటాడు వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. తనకు ఐడియా వస్తే చాలు ఎవరి లైఫ్‌నైనా వెండితెర పై ఆవిష్కరిస్తాడు ఈ స్వేచ్ఛా జీవి. లాక్‌డౌన్‌ తర్వాత చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతే రాము మాత్రం రోజుల వ్యవధిలో సింపుల్‌గా సినిమాలు తీస్తూ నెట్‌లో విడుదల చేస్తూ తెగ సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను ఈ నెల 25న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. […]

Written By: Neelambaram, Updated On : July 22, 2020 10:15 am
Follow us on


తన, మన, పర అన్న తేడా లేకుండా అందరినీ కెలికేస్తుంటాడు వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. తనకు ఐడియా వస్తే చాలు ఎవరి లైఫ్‌నైనా వెండితెర పై ఆవిష్కరిస్తాడు ఈ స్వేచ్ఛా జీవి. లాక్‌డౌన్‌ తర్వాత చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతే రాము మాత్రం రోజుల వ్యవధిలో సింపుల్‌గా సినిమాలు తీస్తూ నెట్‌లో విడుదల చేస్తూ తెగ సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను ఈ నెల 25న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. వర్మ నేరుగా చెప్పకోకపోయినా.. పోస్టర్లు, పాత్రధారుల లుక్స్‌ చూస్తుంటే ఇది పవన్ కళ్యాణ్‌ లైఫ్‌ ఆధారంగా తీస్తున్న సినిమా అని అందరికీ అర్థమైంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ రాముపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వర్మ స్టయిల్లోనే అతనికి బదులివ్వాలని నిర్ణయానికి వచ్చారు. పవన్‌ ను అభిమానించే కొందరు ఆర్జీవీపై వరుస సినిమాలతో దాడి చేస్తున్నారు. రాము జీవితం ఆధారంగా ‘పరాన్న జీవి’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు వపన్‌ వీరాభిమాని, బిగ్‌బాస్‌ ఫేం డాక్టర్‌ నూతన్‌ నాయుడు.

Also Read: పాపం.. దిల్ రాజు కాస్త, నిల్ రాజు ?

ఫస్ట్‌లుక్‌తోపాటు టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘జీవి జీవి ఇది పరాన్న జీవి.. నీతిలేని ఓ నిశీధి జీవి. జీవీ నిర్జీవి – అతడే ఆర్జీవి. పచ్చి నెత్తురు మరిగిన జీవి.. పచ్చి బూతులు మొరిగే జీవి. చచ్చిన వాడిని వదలని జీవి.. బతికున్నోడిని చంపే జీవి’ అంటూ రాముపై తమ కసినంతా వెల్లగక్కారు. ఈ మూవీని ఈ నెల 25న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. మరోవైపు జొన్న విత్తుల ‘ఆర్జీవీ’ అనే టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు వర్మపై వెబ్‌ సిరీస్‌ కూడా వస్తోంది. పవన్‌ వీరాభిమాని, కమేడియన్‌ షకలక శంకర్ ప్రధాన పాత్రలో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఆర్జీవీని అచ్చుగుద్దినట్టు అనుకరించే శంకర్ ఈ సిరీస్‌లో రాము పాత్రలో నటిస్తున్నాడు. దీనికి ‘డే రా బాబా’నే టైటిల్‌ ఖారారు చేశారు. ఓ యాంకర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తున్న టీజర్ను రిలీజ్‌ చేశారు. ఈ సిరీస్‌కు వీరు. కె. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నూత‌న్ నాయుడు తీస్తున్న ‘ప‌రాన్న జీవి’లో కూడా ఆర్జీవీగా షకలక శంకరే కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లూ అందరితో ఆడుకున్న ఆర్జీవీని ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ఆడుకోవడం మొదలు పెట్టారన్నమాట.