Kesari 2 : రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కేసరి 2′(Kesari 2 Movie). కానీ మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు భారీ రేంజ్ లో లేకపోయినప్పటికీ, రెండవ రోజు, మూడవ రోజున డీసెంట్ స్థాయి జంప్స్ ని సొంతం చేసుకొని పర్వాలేదని అనిపించింది. కానీ ట్రేడ్ కి మాత్రం కలెక్షన్స్ అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఎందుకంటే టాక్ కి తగ్గ వసూళ్లు కావు అవి. అక్షయ్ కుమార్ ఈ తరం స్టార్ హీరోలలో ఒకరు. ఆయన సూపర్ హిట్ అయితే మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావాలి , కానీ ఈ సినిమాకు కేవలం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. తన తోటి స్టార్ హీరోలు కేవలం మొదటి రోజు 30 కొల్లగొడుతున్న ఈ రోజుల్లో అక్షయ్ కుమార్(Akshay Kumar) మూడు రోజుల్లో 30 కోట్లు కొట్టడం అంటే అవమానమే అనొచ్చు.
Also Read : బాక్స్ ఆఫీస్ వద్ద ‘కేసరి 2’ సెన్సేషన్..ఏకంగా రెండు రెట్లు పెరిగిన వసూళ్లు!
అయితే ఓపెనింగ్ వీకెండ్ టాక్ కి తగ్గ వసూళ్లు ఎలాగో లేవు, కానీ లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ సోమవారం రోజు వచ్చిన వసూళ్లు చూస్తే లాంగ్ రన్ కష్టమే అని అనిపిస్తుంది. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆదివారం రోజున వచ్చిన వసూళ్లతో పోలిస్తే, ఏకంగా 53 వసూళ్లు సోమవారం నాడు డ్రాప్ అయ్యాయి అట. ఒక సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకు ఇంత డ్రాప్స్ రావడం సరికాదు. సోమవారం రోజున ఈ చిత్రానికి 4 కోట్ల 50 లక్షలు వచ్చాయని, ఓవరాల్ గా ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 34 కోట్ల 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం సరిపోని వసూళ్లు ఇవి.
అయితే నిర్మాతలు ఈ చిత్రానికి నేటి నుండి అనేక మేజర్ మల్టీప్లెక్స్ చైన్స్ లో కేవలం 99 రూపాయలకు టికెట్స్ ని అందుబాటులోకి తెచ్చింది. ఆ కారణం చేత ఈ చిత్రానికి ఈరోజు బుక్ మై షో టికెట్ సేల్స్ లో కాస్త గ్రోత్ కనిపించింది. ప్రస్తుతానికి ఈ సినిమాకు గంటకు 8 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ కి, పెట్టిన టికెట్ రేట్స్ కి ఇది కూడా తక్కువే అని అంటున్నారు. కనీసం గంటకు 20 వేల టికెట్స్ అమ్ముడుపోతేనే బాగున్నట్టు. అయితే ఎందుకు ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు?, హీరో గా అక్షయ్ కుమార్ పని ఇక అయిపోయినట్టేనా?, లేకపోతే ఆన్లైన్ లో వస్తున్న పాజిటివ్ టాక్ బయట రావడం లేదా?, ఇవి రెండు కాకుండా కోర్ట్ రూమ్ డ్రామాస్ ని బాలీవుడ్ ఆడియన్స్ ఆదరించే మూడ్ లో ప్రస్తుతం లేరా అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు నెటిజెన్స్.
Also Read : ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?