Samantha : అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) తో రెండవ పెళ్లి చేసుకున్నప్పట్టి నుండి సమంత(Samantha Ruth Prabhu) అభిమానులు కూడా సమంత రెండవ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా లో ఎన్నో వేల పోస్టులు వేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు(Raj Nidmoru) తో డేటింగ్ చేస్తున్న విషయం ఖరారు అవ్వడంతో, అభిమానులు సమంత కి కూడా ఒక తోడు దొరికింది అని సంతోషించారు. ఇటీవలే ఆమె తిరుమలకు రాజ్ నిడిమోరు తో కలిసి వచ్చిన ఘటన, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్లి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
సమంత ఇంట్లో అందరూ కూడా రాజ్ నిడిమోరు తో రెండవ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారట. సమంత వైపు నుండి క్లియర్ అయ్యింది కానీ, రాజ్ నిడిమోరు వైపు నుండి ఇంకా క్లియర్ కాలేదు. అతని కుటుంబ సభ్యులు కూడా సమంత తో పెళ్ళికి ఒప్పుకున్నారు, కానీ రాజ్ నిడిమోరు కి తన మొదటి భార్య నుండి ఇంకా విడాకులు జరగలేదు. కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కానీ, తుది తీర్పు రావాల్సి ఉంది. ఆ తుది తీర్పు వచ్చే వరకు వీళ్లిద్దరు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేరు. కాబట్టి మరో రెండు నెలలకు పైగా కచ్చితంగా ఎదురు చూడాల్సిందే. సమంత అనారోగ్యం గా ఉన్న సమయంలో రాజ్ నిడిమోరు ఆమె పై చూపించిన శ్రద్దా, జాగ్రత్తలు, ఆమె కోసం పని చేసిన తీరుపై సమంత మనసు కరిగిపోయిందట. ఆమెనే ముందుగా రాజ్ కి ప్రపోజ్ చేసినట్టు బాలీవుడ్ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది.
నాగ చైతన్య తో వైవాహిక బంధం లో ఉన్నప్పుడే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ చిత్రీకరణ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యేలోపే విడాకులు జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా ఎంతో కృంగిపోయిన సమయంలో రాజ్ ఆమెకు ఇచ్చిన ధైర్యం, భరోసా సాధారమైనది కాదట. ఆ సమయం నుండే వీళ్లిద్దరి మంచి స్నేహ బంధం మొదలైంది. ఏ ముహూర్తం లో సమంత ఈ సిరీస్ ని ఒప్పుకుందో కానీ ఆమె జాతకమే మొత్తం మారిపోయింది. అప్పటి వరకు హీరోయిన్ పాత్రలతో మెరిసిన సమంత, మొదటిసారి విలన్ రోల్ లో నటించి దేశవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ ద్వారా క్రేజ్ ని సంపాదించుకుంది. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఊహించని పరిణామాలు ఎదురు అయ్యాయి. ఇకపోతే ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్’ అనే చిత్రం వచ్చే నెల 9న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత