
‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరోయిర్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెంగ్విన్’. అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదల కానున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని నేచురల్ స్టార్ నాని ఈ రోజు విడుదల చేశాడు. ‘పెంగ్విన్ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా, ఇంట్రస్టింగ్‌గానే కాకుండా భయం తెప్పించేలా ఉంది. ఇంట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా కిట్టీ (కీర్తి)’ అని ట్వీట్ చేశాడు. ఇదే టైమ్‌కు తమిళ్‌లో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ పెంగ్విన్ ట్రైలర్లను రిలీజ్ చేశారు.
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇప్పటికే చాలా క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తిక్ సుబ్బరాజుతో కలిసి స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. అడవిలో తప్పిపోయిన కుమారుడిని వెతికే తల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. పోలీసులు కూడా అడవిలో వెతకడం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చివర్లో ఓ సైకో ఎవరినో నరుకుతూ కనపడతాడు. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
Happy to launch the trailer of #Penguin .This looks very promising, intriguing and scary👌🏼👍🏼
First day first show at home fix kitty @KeerthyOfficial 🤗https://t.co/LMhaIT0gB2 –
Telugu
@EashvarKarthic @karthiksubbaraj @Music_Santhosh @KharthikD @PrimeVideoIN #PenguinTrailer— Nani (@NameisNani) June 11, 2020