భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2019 సంవత్సరంలో చంద్రయాన్ 2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. 95 శాతం చంద్రయాన్ 2 సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్ గమ్యస్థానానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ వల్ల భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోగా ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోంది. తాజాగా ఆర్బిటర్ లోని కెమెరా చంద్రుడి చంద్రుడి కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ ఫోటోలు తీసింది.
Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిషన్.. ఎక్కడంటే?
ఈ బిలానికి అంతరిక్ష పరిశోధనల పితామహుడుగా పేరు పొందిన విక్రమ్ సారాభాయ్ పేరును శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రష్యా లూనా 21, అమెరికా అపోలో 17 ల్యాండింగ్ సైట్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని సమాచారం. ఇస్రో శాటిలైట్ ఇమేజరీ జియోమెట్రికల్ కరెక్టెడ్ విధానం ద్వారా బిలంను త్రీడీలో రూపొందించినట్లు ప్రకటన చేసింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ విక్రమ్ సారాభాయ్ శత జయంతి వేడుకలు జరుపుకునే సమయంలో ఆర్బిటర్ ఫోటో తీసిందని చెప్పారు.
ఆర్బిటర్ బిలాన్ని గుర్తించటంలో చక్కగా పని చేసిందని… ఈ బిలానికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టాలని సూచించామని అన్నారు. ఆర్బిటర్ బిలం ఫోటో తీసి విక్రమ్ సారాభాయ్ కు ఘనమైన నివాళులను అర్పించిందని అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్ మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మెషీన్ కోసం సిద్ధమైంది. ఇస్రో ఈ ప్రయోగాన్ని 2022 ఆగష్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది.
Also Read: 18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ??