‘మహానటి’ మూవీలో పాతతరం సావిత్రిగా నటించి కీర్తి సురేష్ జాతీయ అవార్డు దక్కించుకుంది. ‘నేను శైలజ’ మూవీతో కీర్తి తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీటో కీర్తి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. కుర్రకారులో కీర్తి సురేష్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళం, మళయాళ సినిమాల్లో నటిస్తూ కీర్తి ప్రస్తుతం బీజీగా ఉంది. ఇదిలా ఉండగానే కీర్తి సురేష్ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆసక్తికరంగా మారింది.
గత కొన్ని రోజులుగా నేషనల్ మీడియాలో ‘మహానటి’ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం జరుగుతుంది. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధానికి ఒకే అన్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకును కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై కీర్తీ సురేష్, ఆమె తల్లిదండ్రులు స్పందించక పోవడంతో పెళ్లి వార్తలపై క్లారిటీ రావడంలేదు. కీర్తీ సురేష్ సన్నిహితులు మాత్రం పెళ్లి వార్తను కొట్టిపడేస్తున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో నితిన్‌కు జోడీగా ‘రంగ్‌దే’, తమిళంలో రజినీకాంత్‌తో కలిసి ‘అణ్ణాత్త’ మూవీల్లో నటిస్తుంది. సినిమాలతో బీజీగా ఉన్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఈ వార్తలపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వార్తలపై కీర్తీ ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.