https://oktelugu.com/

Keerthy Suresh : కీర్తి సురేష్ బాలనటిగా నటించిన చిరంజీవి సినిమా ఏంటో చెప్పగలరా..? మీ అందరికి బాగా ఇష్టమైన సినిమానే అది!

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఊర మాస్ ఇమేజి తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్న చిరంజీవి, 'డాడీ' లాంటి సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా తో 2001 వ సంవత్సరం లో మన ముందుకు వచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 30, 2024 / 09:31 PM IST

    Keerthy Suresh

    Follow us on

    Keerthy Suresh : బాలనటులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది నేడు స్టార్స్ గా, సూపర్ స్టార్స్ గా కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ , రాశి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ వస్తూనే ఉంటుంది. అలా బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్. ఈమె తల్లి మేనక మలయాళం లో పెద్ద స్టార్ హీరోయిన్. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘పున్నమి నాగు’ చిత్రంలో నటించింది. తెలుగు లో ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ, మలయాళం లో మాత్రం ఒక స్టార్ గా చాలా కాలం కొనసాగింది. కీర్తి సురేష్ కూడా బాలనటిగా మలయాళం సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. కానీ తెలుగులో కూడా ఈమె ఒక సినిమాలో నటించింది అనే విషయం మీకెవరికైనా తెలుసా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ఊర మాస్ ఇమేజి తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్న చిరంజీవి, ‘డాడీ’ లాంటి సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా తో 2001 వ సంవత్సరం లో మన ముందుకు వచ్చాడు. సినిమాకి అప్పట్లో పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, చిరంజీవి కి ఉన్న మాస్ ఇమేజి కారణంగా ఆయనని అభిమానులు ఇంత సాఫ్ట్ రోల్ లో చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజి అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్ర కోసం చాలా ఆడిషన్స్ చేశారట అప్పట్లో. అలా చిరంజీవి దృష్టిలోకి కీర్తి సురేష్ వచ్చింది. 2000 సంవత్సరం లో కీర్తి సురేష్ బాలనటిగా మలయాళం లో ‘పైలట్స్’ అనే సినిమా చేసింది. ఇందులో ఆమె నటన చూసి ఎంతో నచ్చిన చిరంజీవి తాను చెయ్యబోతున్న డాడీ సినిమాలో నటింపచేస్తే బాగుటుందని అనుకున్నాడు. కీర్తి సురేష్ తల్లి కూడా అందుకు ఒప్పుకుంది. రెండు కీలకమైన సన్నివేశాలను కూడా డైరెక్టర్ సురేష్ కృష్ణ తీసాడు.

    కానీ ఎందుకో వాటి ఔట్పుట్ చూసిన తర్వాత సురేష్ కృష్ణ సంతృప్తి చెందలేదు. తాను అనుకున్నట్టుగా ఆ చిన్న పాప క్యారక్టర్ రావడం లేదు. ఇదే విషయాన్నీ చిరంజీవి కి చెప్పగా, వేరే అమ్మాయిని చూద్దాం అని చెప్పి కీర్తి సురేష్ ని తప్పించి అనుష్క మల్హోత్రా అనే అమ్మాయిని తీసుకున్నారు. ఈ అమ్మాయి ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అలా కీర్తి సురేష్ బాలనటిగా చిరంజీవి సినిమాలో నటించినా కూడా వెండితెర మీద ఆయనతో కలిసి కనిపించే అదృష్టం దక్కలేదు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ అయ్యాక చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె చిరంజీవి సోదరి గా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిల్చింది.