Gabbar Singh’ re-release : బాలీవుడ్ లో ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ కి భారీ డిమాండ్..ఒక్క గుజరాత్ లోనే ఇన్ని షోస్ వేస్తున్నారా!

కర్ణాటక మరియు నార్త్ ఇండియా కి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో కూడా ఈ రీ రిలీజ్ చిత్రం పై భారీ డిమాండ్ ఏర్పడింది.

Written By: Vicky, Updated On : August 30, 2024 9:43 pm

Gabbar Singh' re-release

Follow us on

Gabbar Singh’ re-release : మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చేస్తుంది. ఎన్నికలలో సంచలన విజయం సాధించి, ఆంధ్ర ప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి పుట్టినరోజు అవ్వడంతో అభిమానులు ఈ ఏడాది చరిత్రలో ఎప్పుడూ మర్చిపోని విధంగా జన్మదిన వేడుకలను చేసేందుకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని గ్రాండ్ గా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే కాదు, కర్ణాటక మరియు నార్త్ ఇండియా కి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో కూడా ఈ రీ రిలీజ్ చిత్రం పై భారీ డిమాండ్ ఏర్పడింది.

కర్ణాటక లో ఇప్పటికే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అలాగే కేరళలో ఏకంగా నాలుగు ఫ్యాన్స్ షోస్ ఫుల్ అయ్యాయట. నోయిడా, పాట్నా, పటేల్ నగర్, ముంబై, ఢిల్లీ, పంజాబ్  వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి స్పెషల్ పడుతున్నాయి అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ ప్రాంతాల నుండే ఈ చిత్రానికి 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఇది సాధారణమైన విషయం కాదు, ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలకు కనీసం 5 లక్షల రూపాయిలు కూడా రాలేదు. అలాంటిది గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతుండటం వల్ల ఈ సినిమాకి ఇలాంటి డిమాండ్ ఏర్పడింది. అంతే కాదు ఒక్క గుజరాత్ లోనే ఈ చిత్రానికి నాలుగు షోస్ పడుతున్నాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ చూస్తుంటే మొదటి రోజు 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీల గా రాబడుతుందని తెలుస్తుంది.

అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి మొదటిరోజు లక్ష డాలర్లు వస్తాయని అనుకున్నారు, కానీ తెలుగు వాళ్ళు, చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో షోస్ అధికంగా లేకపోవడం వల్ల ఈ చిత్రం టాప్ 2 , లేదా టాప్ 3 గ్రాసర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త నిరాశకు కలిగించే వార్త. అయితే ఈ రెండు రోజుల్లో భారీ టిక్కెట్లు అమ్ముడుపోతే కచ్చితంగా ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశం ఉంటుంది కానీ, ముందు పెట్టుకున్న లక్ష డాలర్ల టార్గెట్ మాత్రం రీచ్ అవ్వడం కష్టమే.