https://oktelugu.com/

Keerthi Suresh: ‘గుడ్​లక్​ సఖి’ నుంచి ‘బ్యాడ్​ లక్​ సఖి’ సాంగ్​ రిలీజ్​!

Keerthi Suresh: మహానటితో తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి కీర్తి సురేశ్. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని అగ్ర తారల్లో ఒకరిగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా గుడ్​లక్​ సఖి. మహిళా ఓరియెంటెడ్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు నగేశ్​ కుకునూర్​ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా, ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 8, 2021 / 12:06 PM IST
    Follow us on

    Keerthi Suresh: మహానటితో తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి కీర్తి సురేశ్. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని అగ్ర తారల్లో ఒకరిగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా గుడ్​లక్​ సఖి. మహిళా ఓరియెంటెడ్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు నగేశ్​ కుకునూర్​ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా, ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్​ వచ్చింది. బ్యాడ్​ లక్​ సఖి పేరుతో ఫుల్​ వీడియో పాటను హీరో రానా విడుదల చేశారు. సినిమాలో కీర్తి సురేశ్​ పాత్రను తెలియజేసేలా ఈ పాటను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెను కష్టపడే మనస్తత్వం ఉన్నప్పటికీ.. దురదృష్టవంతురాలిగా చూపించారు.

    ఈ పాటను హరిప్రియ, సమీరా భరద్వాజ్​, ఎంఎల్​ ఆర్​ కార్తికేయన్​ ఆలపించారు. అదిగో వస్తుంది బ్యాడ్​ లక్ సఖి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 26న ఈ సినిమా విడుదల కానుంది.

    మరోవైపు, సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాలోనూ నటిస్తోంది కీర్తి సురేశ్​. ఇందులో మహేశ్​ సరసన కనిపించనుంది. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న విడుదలకు సిద్ధమైంది.