https://oktelugu.com/

ఫుల్ గ్లామరస్ రోల్ లో ‘కీర్తి సురేష్’ !

అందంలో అభినయంలో ‘కీర్తి సురేష్’ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హోమ్లీ లుక్ లో డిసెంట్ పాత్రలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. అందుకే.. కీర్తికి ఎక్కువుగా అలాంటి పాత్రలే వచ్చాయి. గ్లామరస్ హీరోయిన్ అవ్వాల్సిన ఫిజిక్ తనకు ఉన్నా.. ఎక్కువుగా తనకు ఫ్యామిలీ టైప్ పాత్రలే వచ్చాయని, అందుకే.. నేను గ్లామరస్ పాత్రలను ఎక్కువ చేయలేకపోయానని.. అవకాశం వస్తే మాత్రం.. తప్పకుండా అలాంటి పాత్రలను కూడా చేస్తానని ఆ మధ్య కీర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. […]

Written By:
  • admin
  • , Updated On : March 8, 2021 / 10:04 AM IST
    Follow us on


    అందంలో అభినయంలో ‘కీర్తి సురేష్’ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హోమ్లీ లుక్ లో డిసెంట్ పాత్రలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. అందుకే.. కీర్తికి ఎక్కువుగా అలాంటి పాత్రలే వచ్చాయి. గ్లామరస్ హీరోయిన్ అవ్వాల్సిన ఫిజిక్ తనకు ఉన్నా.. ఎక్కువుగా తనకు ఫ్యామిలీ టైప్ పాత్రలే వచ్చాయని, అందుకే.. నేను గ్లామరస్ పాత్రలను ఎక్కువ చేయలేకపోయానని.. అవకాశం వస్తే మాత్రం.. తప్పకుండా అలాంటి పాత్రలను కూడా చేస్తానని ఆ మధ్య కీర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

    బహుశా దర్శకుడు పరుశురామ్ ఆ మాటలు విన్నాడేమో, కీర్తిని గ్లామర్ పరంగా ఫుల్ గా చూపించడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఆమె “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తోంది. దుబాయిలో జరిగిన షూటింగ్ లో ఆమె పాల్గొంది. అక్కడ కూడా ఆమె డ్రెసింగ్ స్టైల్ పూర్తి మోడ్రన్ గా ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో కీర్తి ఎక్కువుగా గ్లామర్ లుక్ లోనే కనిపిస్తోందని.. స్లీవ్ లెస్ తో పాటు స్కట్స్ నే ఆమె ఎక్కువగా వేసుకుంటుందని తెలుస్తోంది.

    అలాగే ఒక సాంగ్ లో బికినీ టైప్ డ్రెస్ లో కూడా కీర్తి సురేష్ సినిమాలో కనిపించనుందని తెలుస్తోంది. కెరీర్ మొదటి నుండి ఎక్కువగా చీరలోనే దర్శనమిస్తూ వస్తోన్న కీర్తి.. చివరకి చీరకట్టులోనే ఫోటోషూట్లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్లో ఆ ఫోటోలనే పోస్ట్ చేస్తూ ఉంటుంది. దానికితోడు ‘మహానటి’ సినిమా తర్వాత ఆమెకి అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి. అందుకే కీర్తి సురేష్ రజినీకాంత్ సరసన ‘అన్నత్తే’లో కూడా ఇలాంటి పాత్రే పోషిస్తోంది. కానీ మహేష్ బాబుతో మాత్రం మోడ్రన్ లుక్ లో రొమాంటిక్ సీన్లు, అండ్ సాంగ్స్ లో ఫుల్ గ్లామర్ గా కనిపించబోతుంది.