https://oktelugu.com/

Actress keerthi Suresh: ఆ స్పెషల్ మూవీకి ఒకే చెప్పిన కీర్తి సురేశ్… నిర్మాతలుగా నటి అమ్మానాన్నలు

Actress keerthi Suresh: యంగ్ హీరో రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్,  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 08:43 PM IST
    Follow us on

    Actress keerthi Suresh: యంగ్ హీరో రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్,  మిస్ ఇండియా  సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

    ప్రస్తుతం వివిధ భాషల్లో కీర్తి సురేశ్ పలు భారీ చిత్రాలలో నటిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె కెరీర్ ఫుల్ జోష్ లో వెళ్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా  ఒక మలయాళ చిత్రానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి ‘వాషి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.  ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ఇది కీర్తి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న చిత్రం. ఈ నిర్మాణ సంస్థ కొత్తదేమీ కాదు. కీర్తి నాన్న సురేష్ మలయాళంలో పేరు మోసిన నిర్మాతే. 80, 90 దశకాల్లో పెద్ద ఎత్తున సినిమాలు కూడా నిర్మించారు. ముందు వేరే నిర్మాతతో కలిసి సినిమాలు తీసిన ఆయన… నటి మేనకను పెళ్లాడాక ‘రేవతి కళామందిర్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.

    కెరీర్ ఆరంభంలో కీర్తి ఈ బేనర్లో ‘పైలట్స్’ అనే సినిమా చేసింది. కానీ తను స్టార్ అయ్యాక మాత్రం సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయలేదు. ఎట్టకేలకు తన అమ్మానాన్నలకు డేట్లిచ్చి ఈ సినిమా చేయబోతోంది. ఈ మూవీ లో టొవినో థామస్ హీరోగా చేస్తుండగా… విష్ణురాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.