Pushpaka Vimanam: హిందీలో రీమేక్ కి రెడీ అవుతున్న ఆనంద్ దేవరకొండ… పుష్పక విమానం

Pushpaka Vimanam: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు ఆనంద్​ దేవరకొండ. ఇటీవ‌ల ఆయన హీరోగా నటించిన చిత్రం “పుష్ప‌క విమానం “. ఈ సినిమా ఇటీవ‌లే న‌వంబ‌ర్ 12 న‌ థీయేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వం వహించారు. కాగా సినిమా కు […]

Written By: Sekhar Katiki, Updated On : November 18, 2021 8:32 pm
Follow us on

Pushpaka Vimanam: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు ఆనంద్​ దేవరకొండ. ఇటీవ‌ల ఆయన హీరోగా నటించిన చిత్రం “పుష్ప‌క విమానం “. ఈ సినిమా ఇటీవ‌లే న‌వంబ‌ర్ 12 న‌ థీయేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వం వహించారు. కాగా సినిమా కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. దీంతో ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ సినిమా రైట్స్ కోసం మూడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ లు పోటీ ప‌డుతున్నాయని స‌మాచారం. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ అనురాగ్ ప‌ర్వ‌త‌నేని తెలిపారు. ఈ సినిమా క్వాలిటీ కారణంగా నే ఈ సినిమా కు ఇంత డిమాండ్ వ‌స్తుంద‌ని అన్నారు. అయితే ఈ మూడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ లు పుష్ప‌క విమానం చిత్ర యూనిట్ తో చ‌ర్చి స్తున్నార‌ని తెలిపారు. త్వ‌ర‌లో నే ఈ సినిమా బాలీవుడ్ లో ప‌ట్టాలు ఎక్క‌నుంద‌ని చెప్పారు. అయితే ఈ సినిమా హింది రిమేక్ లో ఆయూష్మాన్ ఖురానా లేదా విక్కి కౌశ‌ల్ హీరో గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అయితే ఈ సినిమా లో అమాయకంగా ఉండేలా హీరో పాత్ర ఉంటుంది. కాబ‌ట్టి ఈ ఇద్ద‌రి ల‌లో ఒక్క‌రని హీరో గా సెల‌క్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.