కీరవాణికి అరుదైన వ్యాధి.. షాక్ లో అభిమానులు?

టాలీవుడ్లోని అగ్ర సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఆయన సినిమాలకు సంగీత దర్శకత్వం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. దాదాపు 200పైగా సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ పరిశ్రమలో కీరవాణికి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా కీరవాణి ఓ అరుదైన వ్యాధికి గురవడంతో అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. Also Read : నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌ కీరవాణి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి […]

Written By: NARESH, Updated On : September 23, 2020 11:22 am
Follow us on

టాలీవుడ్లోని అగ్ర సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఆయన సినిమాలకు సంగీత దర్శకత్వం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. దాదాపు 200పైగా సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ పరిశ్రమలో కీరవాణికి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా కీరవాణి ఓ అరుదైన వ్యాధికి గురవడంతో అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

Also Read : నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌

కీరవాణి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ చేస్తున్న సమయంలో దర్శకుడు రాజమౌళి దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఇటీవలే వారంతా కరోనా నుంచి కోలుకోవడంతో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. కరోనాను జయించిన తర్వాత కీరవాణి, ఆయన కుమారుడు ప్లాస్మా దానంచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

తాజాగా కీరవాణి తనకు ఓ అరుదైన వ్యాధి సోకిందంటూ సోషల్ మీడియా స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు. తనకు మల్లిపుల్ సెలిరోసిస్(ఎంఎస్) అనే అరుదైన వ్యాధి సోకిందని తెలిపారు. కొద్దిరోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. ఇది ఫలానా వయస్సు అనే తేడా లేకుండా ఎవరైనా రావచ్చన్నారు.

ఈ అరుదైన వ్యాధి గురించి చాలామందికి అవగాహన లేదని తెలిపారు. ఈ వ్యాధి సోకినవారు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని సూచించారు. యెగా.. మ్యూజిక్ వంటి వాటితో ఈ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని తెలిపారు. ఈ వ్యాధిపై ‘ఎంఎస్ ఇండియా’ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గళాన్ని విన్పిస్తుందని ఈ వీడియో కీరణవాణి తెలిపారు. కాగా ఆయన అభిమానుంతా ఈ వ్యాధి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేవుడి ప్రార్థిస్తున్నారు.

Also Read : ‘రేణు దేశాయ్’ సక్సెస్ అయితే.. అకీరాని కూడా.. !