బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా ఇంకా సంచలనంగానే ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ నటి రియా చక్రబోర్తి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు నుండి మాదకద్రవ్యాల సరఫరా ఆరోపణలతో రియా చక్రబోర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సెప్టెంబర్ 9న రిమాండ్ కు తరలించగా.. కోర్టు విధించిన రెండు వారాల గడువు నేటితో ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే ఎన్‌డీపీఎస్ కోర్టు ఆ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రియాను రెండు వారాల పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు విచారించనున్నారు. అలాగే రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ కస్టడీను కూడా అక్టోబర్ 6వరకు పొండిగించడంతో ఈ డ్రగ్ కేసు వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.
Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?
అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారి విచారణ జరుగుతున్న క్రమంలోనే, రియా తరపున లాయర్ ఆమె బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. కాగా రియా బెయిల్ కి సంబంధించి రేపు విచారణకు రానుంది. మరి ఇప్పటికే రియా బెయిల్ ను పలుసార్లు న్యాయస్థానం రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి రేపు కూడా అదే జరిగే అవకాశం ఉంది. రియా ఫ్యామిలీ అండ్ ఆమె సానుభూతిపరులు మాత్రం ఆమెకు బెయిల్ మంజూరు అవ్వాలని ఆశ పడుతున్నారు. మొత్తానికి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు.. డ్రగ్స్ కేసుగా టర్న్ తీసుకోవడంతో మొత్తం బాలీవుడ్ తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలన్నీ ఏమి జరగబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్
ఏది ఏమైనా సుషాంత్ సింగ్ రాజ్ సాధారణ స్థాయి నుండి స్టార్ డమ్ తెచ్చుకుని ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక హీరో. మరి అలాంటి హీరో అర్ధంతరంగా చనిపోవడం సినీ ప్రేముకుల మనసులను తీవ్రంగా కలిచివేసింది. పైగా సుషాంత్ మరణం పై కూడా రోజురోజుకూ అనేక ఆరోపణలు తెరపైకి వస్తుండటం కూడా సుశాంత్ అభిమానులతో పాటు యావత్తు సినీ జనాలను గందరగోళంలోకి నెట్టేశాయి. దానికితోడు సుషాంత్ మరణం పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన మరో సంచలన ఆరోపణలు కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపు 43 మందిని సీబీఐ అధికారులు విచారించారు. మరి సుషాంత్ కేసు పై త్వరలో క్లారిటీ రావాలని కోరుకుందాం.