Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన సినిమాలు మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచిన దర్శకుడు రాజమౌళి…ఇక ఈయన చేసిన ‘బాహుబలి’, ‘త్రిబుల్ ఆర్’ సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమా మరొకెత్తుగా మారబోతోంది. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ‘గ్లోబ్ ట్రిట్టర్’ అనే పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ని రాజమౌళి చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు… ఈ సినిమాలో ‘పృధ్విరాజ్ సుకుమారన్’ విలన్ పాత్రను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అతన్ని ఈవెంట్ స్టేజి మీదకి పిలవడానికి కీరవాణి స్టేజ్ మీదకి వచ్చి ఒక బ్యాగ్రౌండ్ సౌండ్ తో మ్యూజిక్ తో అతన్ని స్టేజ్ మీదకి పిలిచాడు.
ఆ మ్యూజిక్ కీరవాణి ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘దమ్ము’ సినిమాలోని ‘రూలర్’ అనే సాంగ్ లోని మ్యూజిక్ లానే ఉంది. ఇదే మ్యూజిక్ ని సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గా వాడే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలైతే వస్తున్నాయి… ఒకవేళ సినిమాలో ఇదే మ్యూజిక్ కనక ఉన్నట్టయితే కీరవాణి తన మ్యూజిక్ ను తనే కాపీ చేసుకున్నాడనే కామెంట్స్ ని ఎదుర్కోక తప్పదు.
మరి ఇదే మ్యూజిక్ సినిమాలో ఉంటే మాత్రం సినిమా మీద కొంతవరకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కీరవాణి బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి సినిమాలో ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు సినిమాను మ్యూజిక్ పరంగా ఏ రేంజ్ లో నిలుపుతాడు అనేది…