Globetrotter Event Vijayendra Prasad Speech: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #Globetrotter మూవీ ఈవెంట్ కాసేపటి క్రితమే మొదలైంది. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు ని ఇలా కూడా చూడొచ్చా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా రాజమౌళి ఊహకందని సర్ప్రైజ్ అందించాడు. నంది వాహనం పై శివుడు ఉగ్రరూపం లో త్రిసూలం అందుకొని స్వారీ చేస్తున్నట్టు ఉన్న మహేష్ బాబు లుక్ ని చూస్తే సాక్ష్యాత్తు పరమేశ్వరుడిని చూస్తున్నట్టు అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు #Globetrotter టైటిల్ తో పిలవబడిన ఈ సినిమాకు ‘వారణాసి'(Varanasi Movie) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాసేపటి క్రితమే ఈ టైటిల్ ని రివీల్ కూడా చేశారు.
సోషల్ మీడియా అప్లోడ్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, కథా రచయితా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు భక్తి పారవశ్యం లో మునిగిపోయాను. ఇందులో ఒక 30 నిమిషాల పోరాట సన్నివేశం ఉంటుంది. మహేష్ బాబు విశ్వరూపాన్ని అందులో మనం చూడొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదు, VFX వర్క్ పూర్తి చేయలేదు, రీ రికార్డింగ్ లేదు, డబ్బింగ్ లేదు..ఇవేమి లేకుండా ఆ సన్నివేశాన్ని చూస్తేనే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఇక అన్ని కుదిరిన తర్వాత ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇది నేను, కాంచి కూర్చొని రాసిన కథ కాదు. ఆ దేవతలే మా చేత రాయించిన కథ. ఆ దేవతలే మా రాజమౌళి తో చేయించుకుంటున్న కథ’ అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.
విజయేంద్ర ప్రసాద్ ఒక సినిమా గురించి మాట్లాడితే, తనకు నిజమైన అనుభూతి కలిగితేనే మాట్లాడుతాడు. మనసులో ఏది ఉంటే అది మాట్లాడే స్వభావం గల వ్యక్తి. అభిమానుల చప్పట్ల కోసం ఉన్నవి లేనట్టుగా,లేనివి ఉన్నట్టుగా చెప్పే రకం కాదు. కాబట్టి ఆయనే ఈ రేంజ్ లో చెప్పాడంటే, రాజమౌళి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాజమౌళి పై సోషల్ మీడియా లో విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా విమర్శలు చేసేవాళ్ళు కూడా సినిమా విడుదలయ్యాక పొగడ్తలతో ముంచి ఎత్తే రేంజ్ లో ఔట్పుట్ ఇవ్వడం ఆయన స్టైల్. ఈ సినిమాకు కూడా అదే జరగబోతోంది.