Ram Prasad Sudheer Srinu controversy: ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి సుడిగాలి సుధీర్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరు మంచి మిత్రులు కూడాను. అయితే గెటప్ శ్రీను, సుధీర్ చేసిన పనికి తన గుండెబద్దలైంది అంటూ.. రామ్ ప్రసాద్ తన ఆవేదన వెళ్లగక్కాడు..
Also Read: ఆలీ తండ్రిది ఇండియా కాదా? వెలుగులోకి షాకింగ్ నిజం
జబర్దస్త్(Jabardasth) షోకి ఆదరణ తగ్గింది అనడంలో సందేహం లేదు. పలువురు స్టార్స్ ఆ షో నుండి తప్పుకోవడమే అందుకు కారణం. ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ బుల్లితెరను ఏలాయి. ఈ షోలకు విపరీతమైన ఆదరణ దక్కింది. యూట్యూబ్ లో సైతం లక్షల మంది జబర్దస్త్ స్కిట్స్ వీక్షించేవారు. సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్స్ మరింత ఆదరణ పొందేవి. సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ముగ్గురు అన్నీ తానై స్కిట్ నడిపేవారు. వీరితో పాటు సన్నీ ఆ టీమ్ లో మరొక కమెడియన్. అయితే సన్నీకి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.
దాదాపు దశాబ్దం పాటు జబర్దస్త్ వేదికగా రామ్ ప్రసాద్(Ramprasad), సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను నవ్వించారు. ఇక ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరి మధ్య గొప్ప సాన్నిహిత్యం ఉంది. త్రీ మంకీస్ చిత్రంలో కలిసి నటించారు. సినిమాల్లో నటిస్తూ కూడా జబర్దస్త్ లో కొనసాగారు. హీరోగా ప్రయత్నాలు చేసే క్రమంలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేశాడు. తర్వాత గెటప్ శ్రీను సైతం తప్పుకున్నాడు. వారిద్దరి నిష్క్రమణతో సుడిగాలి సుధీర్ టీమ్ లో రామ్ ప్రసాద్ ఒంటరి అయ్యాడు. రామ్ ప్రసాద్ మాత్రమే ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్నాడు.
సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ మానేయడం తనను ఎంతటి వేదనకు గురి చేసిందో తాజాగా రామ్ ప్రసాద్ వెల్లడించారు. ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ ముగ్గురు మిత్రులు సందడి చేశారు. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. దాదాపు పదేళ్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, నేను స్కిట్స్ చేశాము. వీరిద్దరూ లేకుండా జబర్దస్త్ స్టేజ్ మీదకు వెళ్లిన రోజు నా గుండెబద్దలైంది. ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతున్న ఫీలింగ్ కలిగింది. మేము ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలని ఆశగా ఉంది.. అంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: తండ్రిని మోసం చేసిన కుటుంబ సభ్యులు.. అనసూయ ఆవేదన.. అసలేం జరిగింది?
రామ్ ప్రసాద్ మాటలకు సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ సైతం ఎమోషనల్ అయ్యారు. సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జబర్దస్త్ కి రీఎంట్రీ ఇస్తే తిరిగి పునర్వైభవం రావడం ఖాయం. సుధీర్ కి సినిమా అవకాశాలు రావడం లేదు. దాంతో యాంకర్ గా పలు షోలు చేస్తున్నాడు. అయితే జబర్దస్త్ కి రావడం లేదు. మల్లెమాల సంస్థతో విబేధాలు తలెత్తాయని, అందుకే సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడనే వాదన ఉంది. ఈ పుకార్లను సుధీర్ మాత్రం ఖండించారు.